అంతర్జాతీయం

ట్రంప్ తొలి సంతకం ఆ దస్త్రంపైనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 21: అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ ముందునుంచి చెబుతున్నట్లుగానే ఒబామా కేర్ ఫైల్‌పైనే తొలి సంతకం చేశారు. శుక్రవారం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటలకే వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలోకి ప్రవేశించిన ట్రంప్ ఒబామా కేర్ పథకానికి సంబంధించిన నిబంధనలను సడలించాలని ఏజన్సీలను ఆదేశించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
ఒబామా కేర్‌ను మార్చి తీరుతానని ట్రంప్ ఎన్నికల సభల్లో పదే పదే చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పైనే తొలి సంతకం చేయడం ద్వారా ఆయన తన హామీని నిలబెట్టుకున్నారు. అయితే ఈ ఉత్తర్వులోని వివరాలను మాత్రం వైట్‌హౌస్ అధికారులు వెల్లడించలేదు. ప్రమాణ స్వీకారం తర్వాత ట్రంప్ వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయానికి వెళ్లి ‘అఫర్డబుల్ కేర్ యాక్ట్’పై సంతకం చేసినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ విలేఖరులకు చెప్పారు. ఒబామా కేర్ వల్ల వివిధ విభాగాలు, ఏజన్సీలపై పడుతున్న భారాన్ని తగ్గించాలని, దాన్ని ఉపసంహరిస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే ఒబామా కేర్ స్థానంలో ట్రంప్ ప్రవేశపెట్టబోయే కొత్త పథకం నియమ నిబంధనలను మాత్రం వివరించలేదు. ఇన్సూరెన్స్‌లకు సంబంధించి అక్కడి ఏజన్సీలకు భారం తగ్గించే దిశగా వారికి మరిన్ని అధికారాలు లభించనున్నట్లు మాత్రం తెలుస్తోంది. ఇన్సూరెన్స్ ఏజన్సీలు, ఆస్పత్రులు, ఫార్మా కంపెనీలు, వైద్యులు, రాష్ట్రాలకు దీనివల్ల ఉపశమనం లనిస్తుంది. మెజారిటీ అమెరికన్లు కూడా ఇదే కోరుకుంటున్నారు.

చిత్రం... అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం
ఒబామా హెల్త్ కేర్ నిబంధనల సడలింపు ఫైల్‌పై తొలి సంతకం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్