అంతర్జాతీయం

సగానికి తగ్గనున్న అమెరికా గ్రీన్‌కార్డులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 8: అమెరికాలో స్థిరపడాలని కోరుకునే విదేశీయులకు ఇది చేదు వార్త. దశాబ్ద కాలంలో అమెరికాకు చట్టబద్ధంగా వలస వచ్చేవారి సంఖ్యను సగానికి తగ్గించేందుకు వీలుగా ఒక చట్టాన్ని రూపొందించాలని ఇద్దరు సెనేటర్లు ప్రతిపాదించారు. అమెరికాలో స్థిరనివాసం ఏర్పరచుకోవాలని లేదా గ్రీన్ కార్డు పొందాలని కోరుకుంటున్న వారి ఆశలపై ఈ చర్య నీళ్లు చల్లడమే. పెద్ద సంఖ్యలో భారతీయులు సహా వివిధ దేశాలకు చెందిన చాలా మంది అమెరికా గ్రీన్ కార్డు పొందడానికి వేచి చూస్తున్నారు. ‘ద రిఫార్మింగ్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయ్‌మెంట్ (రెయిజ్) యాక్ట్’ అనే ఈ బిల్లును రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ టామ్ కాటన్, డెమొక్రటిక్ పార్టీకి చెందిన డేవిడ్ పెర్‌డ్యు ప్రవేశపెట్టారు. నైపుణ్యాల ఆధారిత వీసా లేకుండా అమెరికాలో ఉంటున్న విదేశీయుల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి వీలుగా అమెరికా వలస వ్యవస్థ (ఇమ్మిగ్రేషన్ సిస్టమ్)ను సవరించడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అమెరికాలో ఏటా పది లక్షల మంది విదేశీయులకు గ్రీన్ కార్డులు జారీ చేస్తున్నారు. అంటే వీరు శాశ్వతంగా అమెరికాలో స్థిరపడటానికి చట్టబద్ధత కల్పిస్తున్నారు. అయితే ఈ సంఖ్యను సగానికి అంటే ఏటా అయిదు లక్షల మందికి తగ్గించాలని కొత్త బిల్లు ప్రతిపాదిస్తోంది. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగం మద్దతు ఉందని భావిస్తున్న ఈ బిల్లు చట్టరూపం దాల్చితే అమెరికాలో వేల సంఖ్యలో ఉన్న భారతీయ సంతతి ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది.