అంతర్జాతీయం

ఉగ్రవాదాన్ని ఓడించాల్సిందే: ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 18: ఉగ్రవాదాన్ని ప్రతిఘటించాల్సిందేనని, ఉగ్రవాదులను ఓడించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ లక్ష్యాలను తమ ప్రభుత్వం సాధించగలదన్న నమ్మకం తనకుందని ఆయన స్పష్టం చేశారు. ‘ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అందరికీ ముప్పే. కనుక దీనిని ప్రతిఘటించి ఉగ్రవాదులను ఓడించి తీరాలి’ అని శుక్రవారం ఆయన అమెరికా ప్రజలను ఉద్దేశించి చేసిన వారాంతపు రేడియో ప్రసంగంలో పేర్కొన్నారు. గత వారం ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయ్యానని, ఇజ్రాయిల్ భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయనకు భరోసా ఇచ్చానని ట్రంప్ తెలిపారు. మిత్రదేశాల భద్రతకు అమెరికా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ట్రంప్ చెప్పారు.
ఇదిలావుంటే, ఉత్తర అమెరికా సైనిక కూటమి (నాటో)కి ట్రంప్ అండగా నిలుస్తారని, ఈ విషయంలో ఆయన నిబద్ధతను ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్సీ స్పష్టం చేశారు.