అంతర్జాతీయం

శ్రీనివాస్ హత్య.. విద్వేష దాడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 1:అమెరికాలో జరుగుతున్న జాతి విద్వేష ఘటనలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వౌనం వీడారు. కాన్సస్‌లో తెలుగు ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యను జాతి విద్వేష హత్యగా, దుష్ట చర్యగా పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి గంటసేపు మాట్లాడిన ట్రంప్ కాన్సస్ ఘటనను ప్రస్తావించారు. శ్రీనివాస్ మరణానికి కాంగ్రెస్ సంతాపం పాటించడం గమనార్హం. విధానాలు, రాజకీయాల పరంగా అమెరికా భిన్న పథాల్లో వెళుతున్నప్పటికీ విద్వేష, దుష్ట చర్యల్ని ఖండించడంలోనూ, గర్హించడంలోనూ ఒక్కటిగానే ఉంటుందని స్పష్టం చేశారు. కాన్సస్ ఘటనపై పెల్లుబికిన నిరసనలే ఇందుకు నిదర్శనమని ట్రంప్ పేర్కొన్నారు. ‘నువ్వు ఉగ్రవాది, మా దేశం నుంచి వెళ్లిపో..’అని ఆవేశంగా అరుస్తూ గత శనివారం శ్రీనివాస్‌పై ఆడం పూరింటన్ అనే మాజీ నేవీ ఉద్యోగి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ ఘటనలోమరో భారతీయుడు కూడా గాయపడ్డాడు. వీరిద్దరినీ రక్షించేందుకు ప్రయత్నించిన గ్రిలోట్ అనే 24 ఏళ్ల అమెరికా పౌరుడూ గాయాలపాలయ్యాడు. భారతీయుల్ని మధ్యప్రాచ్యం నుంచి వచ్చిన వారుగా పరిగణించిన పూరింటన్ వారిని దుర్భాషలాడుతూ కాల్పులకు ఒడిగట్టాడు. ఈ ఘటనను విద్వేష పూరితమైనదిగా వైట్‌హౌస్ ఖండించడం, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కూడా వౌనం వీడాలంటూ దేశాధ్యక్షుడికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ట్రంప్ మాట్లాడారు. కాన్సస్‌లో జరిగిన హత్యనే కాకుండా గత కొంత కాలంగా యూదులపై జరుగుతున్న దాడుల్ని ట్రంప్ ఖండించారు. సామరస్యం, సమైక్య జీవనానికి, స్వేచ్ఛకు పట్టుగొమ్మగా ఉన్న అమెరికాలో ఈ రకమైన విద్వేష ఘటనలు జరగడం దురదృష్టకరమంటూ అనేక మంది ఖండించారు. ముఖ్యంగా ఇండో-అమెరికన్ సంస్థలు కూడా జోక్యం చేసుకుని కాన్సస్ ఘటనను ఖండించాలని ట్రంప్‌కు విజ్ఞప్తి చేశాయి. కాన్సస్ ఘటనను విద్వేష దాడిగానే పరిగణించి ఎఫ్‌బిఐ దర్యాప్తు జరుపుతోంది.