అంతర్జాతీయం

అమెరికాలో ఆగని విద్వేషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మార్చి 5: హైదరాబాద్ టెకీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్యోదంతాన్ని మరువక ముందే అమెరికాలో మరో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి జాతి విద్వేష తూటాలకు గురై, తీవ్రంగా గాయపడ్డాడు. దీప్ రాయ్ అనే 39 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన అమెరికా జాతీయుడయిన సిక్కు వ్యక్తిపై ముఖానికి పాక్షికంగా మాస్కు ధరించి వచ్చిన దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పులు జరపడానికి ముందు ఆ దుండగుడు ‘నీ సొంత దేశానికి వెళ్లిపో’ అని అరిచాడు. వాషింగ్టన్‌లోని కెంట్‌లో గల తన ఇంటి వెలుపల శుక్రవారం తన వాహనానికి సంబంధించిన పనిచేసుకుంటున్న దీప్‌రాయ్‌పై తన ఇంటి వైపు నడుచుకుంటూ వచ్చిన ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. దుండగుడు కాల్పులు జరపడానికి ముందు ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగిందని కెంట్ పోలీసులు చెప్పారు. ‘నీ సొంత దేశానికి వెళ్లిపో’ అని ఆ దుండగుడు అరిచినట్లు రాయ్ చెప్పారని వారు పేర్కొన్నారు. తరువాత దుండగుడు తన వద్ద ఉన్న తుపాకీతో రాయ్ భుజంపై కాల్పులు జరిపాడు. ఆరడుగుల ఎత్తు గల దుండగుడు ముఖం కింది సగభాగానికి మాస్కు ధరించి ఉన్నాడని రాయ్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన రాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాయ్ భుజంలో తూటా దిగటం వల్ల అతని ప్రాణాలకు ఎలాంటి అపాయం లేదని కెంట్ పోలీస్ చీఫ్ కెన్ థామస్ చెప్పారు. కాల్పులు జరిపిన దుండగుడి కోసం గాలిస్తున్నట్టు ఆయన వివరించారు.