అంతర్జాతీయం

శ్రీనివాస్ కూచిభొట్ల మృతిపై ప్రధానికి కాన్సాస్ గవర్నర్ లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 8: గత నెల తమ రాష్ట్రంలో భారతీయులపై జరిగిన దారుణ హింసాత్మక చర్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ అమెరికాలోని కాన్సాస్ రాష్ట్ర గవర్నర్ శాన్ బ్రౌన్‌బ్యాక్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తమ రాష్ట్రంలో విద్వేషానికి, అసహనానికి తావు లేదని ఆ లేఖలో స్పష్టం చేశారు. గత నెల కాన్సాస్‌లో నేవీ మాజీ ఉద్యోగి ఆదమ్ పురింటన్ ఒక బార్‌లో జరిపిన కాల్పుల్లో 32 ఏళ్ల శ్రీనివాస్ కూచిభొట్ల అనే తెలుగు ఇంజనీర్ మృతిచెందగా మరో తెలుగు యువకుడు అలోక్ మాదసాని గాయపడిన విషయం తెలిసిందే. శ్రీనివాస్, అలోక్‌లపై జరిగిన దాడికి కాన్సాస్ రాష్ట్ర గవర్నర్‌గా తాను తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేస్తున్నట్లు బ్రౌన్‌బ్యాక్ ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సైతం తన ఆవేదనలో పాలు పంచుకొంటున్నారని ఆయన అన్నారు. శ్రీనివాస్ భార్య సునయన, హైదరాబాద్‌లోని అతని కుటుంబ సభ్యుల బాధ, ఆవేదనను వర్ణించడానికి మాటలు చాలవని కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.