అంతర్జాతీయం

మోదీ చేతల మనిషని ప్రజలు భావించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 11: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సాదించిన విజయాలను నరేంద్ర మోదీకి మద్దతుగా ఓటర్లు ఇచ్చిన తీర్పుగా అమెరికాకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ విశే్లషకుడు అభివర్ణించారు. అంతేకాదు, ప్రధానమంత్రిని ఓటర్లు చేతల మనిషిగా చూస్తున్నారని కూడా ఆయన అన్నారు. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో బిజెపి సాధించిన చరిత్రాత్మక విజయంపై కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్‌లో దక్షిణాసియా ప్రోగ్రామ్ ఇన్‌చార్జి మిలన్ వైష్ణవ్ స్పందిస్తూ బిజెపి రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీ సాధించడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. ‘ఉత్తరాఖండ్‌లో ఘన విజయంతో పాటుగా ఈ విజయం మోదీకి మద్దతుగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. నోట్ల రద్దుపై జనం ఏమనుకున్నప్పటికీ ప్రధాని చేతల మనిషిగానే ఓటర్లు చూస్తున్నారని ఇది చాటి చెబుతోంది’ అని ఆయన అన్నారు.