అంతర్జాతీయం

కన్నతండ్రే కాలయముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 29: కన్నతండ్రే స్వయంగా చేసిన దాడిలో బాబు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఓ ఏడాది బాలిక కంటి చూపును పూర్తిగా కోల్పోయింది. వినికిడి శక్తి కూడా దెబ్బతిన్నది. పాక్షికంగా మాత్రమే వినగలుగుతోంది. లండన్‌లో ఇటీవల ఈ కిరాతకానికి పాల్పడిన భారతీయ సంతతికి చెందిన 33 ఏళ్ల విద్యాసాగర్ దాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రొమేనియాకు చెందిన క్రిస్టినేల డట్కును వివాహం చేసుకున్న దాస్‌కు కవల పిల్లలు. వీరిలో ఒకరు పాప కాగా, మరొకరు బాబు. దాస్ ఒక హోటల్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నాడు. లండన్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో నివసిస్తున్న దాస్ ఇటీవల తన భార్య స్నానపు గదిలో ఉన్న సమయంలో కుమారుడు, కుమార్తె తలపై సుత్తితో గట్టిగా కొట్టాడు. ఈ దాడిలో బాబు మృతి చెందగా, పాప తీవ్రంగా గాయపడింది. కేసు దర్యాప్తులో భాగంగా తీవ్రంగా గాలించిన పోలీసులు ఈ నెల 18న దాస్‌ను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. హత్య కేసు, హత్యాయత్నం కేసులను దాస్ ఎదుర్కొంటున్నాడు.