జాతీయ వార్తలు

తవాంగ్ చేరుకున్న దలైలామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తవాంగ్, ఏప్రిల్ 7: టిబెటన్ల ఆధ్యాత్మి గురువు దలైలామా శుక్రవారం ఎట్టకేలకు అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ చేరుకున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో దలైలామా పర్యటన పట్ల చైనా అభ్యంతరాలను లెక్కపెట్టని ఆయన 58 ఏళ్ల క్రితం టిబెట్‌నుంచి భారత్‌లోకి తొలిసారిగా అడుగుపెట్టిన ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ముఖ్యమం త్రి పేమా ఖందూతో కలిసి ఆయన ఇక్కడికి వచ్చారు. దలైలామా ఈ నెల 4నే తవాంగ్ రావలసి ఉండింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన గౌహతినుంచి ఇక్కడికి చేరుకోవడానికి 550 కిలోమీటర్లు రోడ్డుమార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది ముఖ్యమంత్రి ఖందూతో కలిసి ఆయన వెస్ట్ కామెంగ్ జిల్లాలోని దిరాంగ్‌నుంచి 140 కిలోమీటర్లు అత్యంత క్లిష్టమైన రోడ్డుమార్గంలో ప్రయాణించి ఇక్కడికి చేరుకున్నారు. ఈ 140 కిలోమీటర్ల మార్గం పొడవునా అరుణాచల్ రాష్ట్ర పోలీసులు, పారా మిలటరీ బలగాల నిఘా ఏర్పాటు చేశారు. దలైలామాకు స్వాగతం పలకడం కోసం తవాంగ్ పట్టణాన్ని అంతా అందంగా అలంకరించారు. ఆయన శనివారంనుంచి నాలుగు రోజుల పాటు ఇక్కడ ఆధ్మాత్మిక ప్రసంగాలు చేస్తారు. తవాంగ్ బౌద్ధారామంలో ఆయన బస చేస్తారని, ఈ నెల 11న ఆయన తిరిగి ధర్మశాలకు బయలుదేరి వెళ్తారని తవాంగ్ డిప్యూటీ కమిషనర్ సంగ్ ఫుంట్సో చెప్పారు. 336 ఏళ్ల నాటి తవాంగ్ బౌద్ధారామం దేశంలోనే అతిపెద్ద బౌద్ధారామమే కాక టిబెట్‌లోని లాసా పోటాలా ప్యాలెస్ తర్వాత ప్రపంచంలోనే రెండో పెద్ద బౌద్ధారామం.
కాగా, శుక్రవారం లోక్‌సభలో సైతం దలైలామా అరుణాచల్ పర్యటనపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేయడం ప్రస్తావనకు వచ్చింది. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌కు సవరణ చేయాలని కోరుతూ ప్రవేశపెట్టిన ఓ ప్రైవేట్ బిల్లుపై చర్చ సందర్భంగా అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపి నినోంగ్ ఎరింగ్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తమ అతిథి విషయంలో భారత్‌కు ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పే అధికారం చైనాకు లేదని అన్నారు.

చిత్రం... శుక్రవారం తవాంగ్ చేరుకున్న దలైలామాకు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యం