అంతర్జాతీయం

అణు యుద్ధానికైనా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాకు దీటుగా జవాబిస్తాం
ఇరాక్, లిబియా మాదిరిగా చూడొద్దు
మా ప్రభుత్వాన్ని కూల్చడం తేలికకాదు
తీవ్రస్థాయిలో హెచ్చరించిన ఉత్తర కొరియా
ప్యాంగ్యాంగ్‌లో భారీ సైనిక ప్రదర్శన
ప్రధాన ఆకర్షణగా ఖండాంతర క్షిపణులు

ప్యాంగ్యాంగ్, ఏప్రిల్ 15: అమెరికా ఎన్ని బెదిరింపులకు దిగినా లొంగేది లేదని ఉత్తర కొరియా మరోసారి ధిక్కార స్వరాన్ని వినిపించింది. అగ్రరాజ్యమని విర్రవీగుతూ కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో యుద్ధ పరిస్థితులను సృష్టిస్తున్న అమెరికా నుంచి తమకు ఎటువంటి ముప్పు ఎదురైనా దీటుగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ‘పెద్దన్న’పై భీకర స్థాయిలో అణు యుద్ధానికి దిగేందుకు సైతం వెనుకాడేది లేదని ఉత్తర కొరియా హెచ్చరించింది. సెంట్రల్ ప్యాంగ్యాంగ్‌లో శనివారం భారీ సైనిక పరేడ్‌ను నిర్వహించిన ఉత్తర కొరియా, తమ అత్యాధునిక ఖండాంతర క్షిపణులతో పాటు ఇతర ఆయుధ సంపత్తిని ప్రదర్శించడం ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరు వలన ప్రాంతీయ స్థాయి ఉద్రిక్తతలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలకు తన ఆయుధ పాటవాన్ని చాటి చెప్పేందుకు ఉత్తర కొరియా ఈ సైనిక ప్రదర్శనను నిర్వహించింది. ఉత్తర కొరియా వ్యవస్థాపక పాలకుడు కిమ్-2 సంగ్ 105వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ సైనిక ప్రదర్శనలో ఆయన మనువడు, ప్రస్తుత దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్నప్పటికీ ఆయన ఏమీ మాట్లాడలేదు. అయితే అధ్యక్షుడు కిమ్ జోంగ్ తర్వాత దేశంలో అంతటి స్థాయి నాయకుడిగా పరిగణించే సైనిక ఉన్నతాధికారి చోయ్ ర్యోంగ్ హాయి అమెరికాను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ప్రాంతానికి తమ బలగాలను పంపడం ద్వారా కొరియా ద్వీపకల్పంలో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ‘నేరస్థుడు’గా ఆయన అభివర్ణించారు. అమెరికా నుంచి తమకు ఎటువంటి ముప్పు ఎదురైనా పూర్తిస్థాయి యుద్ధానికి దిగి దీటుగా జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే తమదైన శైలిలో ‘పెద్దన్న’పై అణు దాడులు నిర్వహించేందుకు సైతం వెనుకాడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
ఆరోసారి అణు పరీక్షను నిర్వహించేందుకు లేదా అమెరికాలోకి సైతం చొచ్చుకెళ్లే భారీ ఖండాంతర క్షిపణిని పరీక్షించేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతోందన్న ప్రపంచ దేశాల భయాందోళనల నడుమ ఈ సైనిక ప్రదర్శన జరిగింది. అయితే అమెరికాతో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా ఈ పరేడ్ ద్వారా సంకేతాలు పంపింది. కేవలం శాంతియుతంగా కొనసాగడమే కాకుండా ఆయుధ సంపత్తిని పెంపొందించుకుని దేశాన్ని, ప్రభుత్వాన్ని సురక్షితంగా ఉంచుకువాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని ఉత్తర కొరియా దీర్ఘ కాలం నుంచి చెబుతున్న విషయం తెలిసిందే. తమ ప్రభుత్వాన్ని కూల్చడం అమెరికాకు అనుకున్నంత సులువు కాదని, ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని, లిబియాలో మహమ్మద్ గడాఫీ సర్కారును కూల్చినట్లుగా తమ దేశంలో కిమ్ జోంగ్ ప్రభుత్వాన్ని కూడా కూల్చగలమని అమెరికా భావిస్తే పప్పులో కాలు వేసినట్టేనని ఉత్తర కొరియా స్పష్టం చేసింది.

చిత్రం.. ఖండాంతర క్షిపణులను ప్రదర్శనకు పెట్టిన ఉత్తర కొరియా