అంతర్జాతీయం

షాకిచ్చిన ఆస్ట్రేలియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, ఏప్రిల్ 18: విదేశీయులకు ఇచ్చే వర్క్ వీసా కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా దాదాపు 95వేల మంది విదేశీ కార్మికులకు ఇచ్చే వీసా కార్యక్రమాన్ని ఎక్కువగా వినియోగించుకునేది భారతీయులే కావటంతో మన దేశం నుంచి ఆస్ట్రేలియా వెళ్లే వారిపైనే ఈ నిర్ణయం ప్రశావం చూపించనుంది. దేశంలో పెరుగుతున్న స్థానిక నిరుద్యోగితను నిర్మూలించటం లక్ష్యంగా ప్రస్తుత వర్క్ వీసా కార్యక్రమంలో మార్పులు చేర్పులు చేసి కొత్త విధానాన్ని ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు అమల్లో ఉన్న వీసాను ‘‘457 వీసా’’ అని పిలుస్తారు. వివిధ కంపెనీలు విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. నాలుగేళ్ల పాటు ఈ వీసా పొందిన వాళ్లు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేయవచ్చు. ‘‘మాది వలస దేశం. కానీ నిజాన్ని కూడా గ్రహించాలి. ఆస్రేలియా కార్మికులకు ప్రాధాన్యం లభించాలి. ఆస్ట్రేలియన్లకు ఉద్యోగాలు రావాలి. అందుకే 457వీసాను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.’’ అని ప్రధానమంత్రి మాల్కం టంబల్ తెలిపారు. 457వీసా కింద ఆస్ట్రేలియాకు వస్తున్న వారిలో ఎక్కువ మంది భారతీయులేనని ఆ యుకె, చైనాలు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయని ఆయన అన్నారు. నిరుడు సెప్టెంబర్ 30 నాటికి దేశంలో 95757మంది 457 వీసాలు పొంది ఉన్నారని రెండో ప్రాధాన్య వీసా కలిగిన వారి సంఖ్య 76,430 ఉందని ఆయన వివరించారు. ‘‘వ్యాపారం వృద్ధి చెందాలంటే నైపుణ్యం ప్రధానం కావాలి. ఇందుకోసం 457వీసా స్థానంలో తాత్కాలిక వీసా కార్యక్రమాన్ని దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకువస్తాం’’ అని మాల్కం వివరించారు. విదేశీ ఉద్యోగులు ఆస్ట్రేలియాలో ఏదైతే నైపుణ్య కొరత ఉందో దాన్ని తీర్చే సామర్థ్యం ఉన్నవారు అయి ఉండాలని ఆయన అన్నారు.