అంతర్జాతీయం

మాక్రన్, లీపెన్ మధ్యే తుదిపోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, ఏప్రిల్ 24:ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల తొలి దఫా ఓటింగ్‌లో ప్రజలు సంప్రదాయ పార్టీలను ఘోరంగా దెబ్బతీశారు. కొన్ని దశాబ్దాలుగా అధికారాన్ని పంచుకుంటూ వచ్చిన లెఫ్ట్, రైట్ పార్టీలను పక్కన పెట్టి ఐరోపా అనుకూల ఇమాన్యుయెల్ మాక్రన్‌కు మొదటి స్థానాన్ని, ఇమిగ్రేషన్ వ్యతిరేక నేషనల్ ఫ్రంట్ నాయకురాలు లీపెన్‌కు రెండోస్థానాన్ని కట్టబెట్టారు. మే ఏడో తేదీన జరుగనున్న తుది ఎన్నికలో వీరిద్దరిలో ఎవరో ఒకరు దేశాధ్యక్ష పదవిని చేపడతారు. మాక్రన్‌కు అనుకూలంగా మద్దతు పెరుగుతున్న దృష్ట్యా ఇతర రాజకీయ పార్టీలు సైతం ఆయనకు మద్దతు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు హోలాండ్ కూడా మాక్రన్‌ను బలపరచడంతో లీపెన్‌కు తుది విజయం అంత తేలిగ్గా కనిపించడం లేదు. రెండో రౌండ్ ఓటింగ్‌లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులెవరూ లేకపోవడం గత ఆరు దశాబ్దాల కాలంలో ఇదే మొదటిసారి. అన్ని విధాలుగా పరిస్థితులు తనకే అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్న మాక్రన్ తుది పోరులో లీపెన్‌పై 20శాతానికి పైగా ఓట్లతో నెగ్గుతానన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
20ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న శివాలయం
పెషావర్, ఏప్రిల్ 24: పాకిస్తాన్‌లో ఇరవై ఏళ్లుగా మూతబడిపోయిన శివాలయంలో పూజాదికాలు నిర్వహించేందుకు పాక్ కోర్టు సోమవారం అనుమతి మంజూరు చేసింది. అబోటాబాద్ జిల్లాలో ఉన్న ఈ శివాలయం ఆస్తుల తగాదావల్ల 20 ఏళ్లుగా పూజాదికాలకు నోచుకోక మూతబడిపోయింది. 2013లో ఒక స్వచ్ఛంద సంస్థ ఆలయ ఆస్తులను కొనుగోలు చేసి, వాటిని స్వాధీనం చేసుకునేందుకు కోర్టులో కేసు వేసింది. కేసును విచారించిన పెషావర్ హైకోర్టు బెంచ్, హిందువులు ఈ ఆలయంలో పూజాదికాలు నిర్వహించుకోవచ్చునని ఆదేశాలు జారీ చేసింది. ఖైబర్ ఫంక్తువాలోని శివాలయంలో రాజ్యాంగంలోని సెక్షన్ 20 ప్రకారం తెరిచి హిందువులు పూజాదికాలు నిర్వహించుకోవచ్చునని బెంచ్‌కు నేతృత్వం వహించిన జస్టిస్ అతీఖ్ హుస్సేన్ షా ఆదేశాలిచ్చారు.