అంతర్జాతీయం

తుపాకీతో బెదిరించి పెళ్లి చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతకు తిరిగి పంపాలని వినతి పాక్ జాతీయుడితో వివాహం చేశారన్న భారతీయ పౌరురాలు
ఇస్లామాబాద్ కోర్టులో పిటిషన్

ఇది ఫ్రాన్స్ విజయం..

పారిస్ విజయోత్సవ ర్యాలీలో మాక్రన్ ఉద్వేగం ఫ్రాన్స్ కొత్త అధ్యక్షుడికి అభిమానుల ఘనస్వాగతం

పారిస్, మే 8: ప్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన యూరప్ అనుకూల వాది ఇమ్మాన్యుయెల్ మాక్రన్‌కు ఆదివారం ఆయన మద్దతుదారులు జాతీ య పతాకాలతో ఘన స్వాగతం పలికారు. యూరోపియన్ యూనియన్‌లో ఫ్రాన్స్ భవితవ్యాన్ని తేల్చే ఈ నిర్ణాయక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి మాక్రన్ దాదాపు 67 శాతం ఓట్లతో తన సమీప ప్రత్యర్థి, నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి లీ పెన్‌పై గెలుపొందారన్న విషయం తెలియగానే దేశ రాజధాని పారిస్‌లోని లోవర్ మ్యూజియం వద్ద వేలాది మంది మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ విజయోత్సవాల సందర్భంగా అక్కడి ప్రపంచ ప్రఖ్యాత గ్లాస్ పిరమిడ్ పసిడి వర్ణ కాంతులతో మెరిసిపోయింది. అనంతరం ఈ ర్యాలీలో పాల్గొన్న మద్దతుదారులను ఉద్ధేశించి మాక్రన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ‘ఈ రాత్రి మీరు గెలిచారు. ఇది దేశం సాధించిన విజయం’ అని మాక్రన్ ప్రకటించగానే ఆయన మద్దతుదారులంతా సంతోషంతో కేరింతలు కొట్టారు. వేలాది మంది మద్దతుదారులు, ప్రత్యేకించి యువ మద్దతుదారులు మాక్రన్ ఫొటోతో ఉన్న టీ-షర్టులు ధరించి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రకటించిన వెంటనే మాక్రన్ మద్దతుదారులు లోవర్ మ్యూజియం వెలుపల స్ట్రీట్ పార్టీలతో సంబరాలు జరుపుకున్నారు.
శుభాకాంక్షల వెల్లువ
కాగా, ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన మాక్రన్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా వివిధ దేశాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
ఇది మాక్రన్ విజయం మాత్రమే కాదని, యూరప్ విజయమని, ఈ విజయంతో మాక్రన్ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని, ఆయనతో కలసి పనిచేసేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నామని ట్రంప్‌తో పాటు జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే, ఐరోపా కమిషన్ ప్రెసిడెంట్ జేన్ క్లూడ్ జంకర్, యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్, యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ ఆంటోనియో టజాని, జపాన్ ప్రధాని షింజో అబే, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడెయు, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్, స్పెయిన్ ప్రధాని మారియానో రజోయ్, ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీ, న్యూజిలాండ్ ప్రధాని బిల్ ఇంగ్లిష్, స్వీడన్ ప్రధాని స్ట్ఫోన్ లోవెన్, అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ తదితరులు పేర్కొన్నారు.

ఫ్రాన్స్ కొత్త అధ్యక్షుడు మాక్రన్‌ను అభినందిస్తున్న హోలాండ్