అంతర్జాతీయం

మాంచెస్టర్‌లో ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాప్ స్టార్ ఆరియానా గ్రాండే కచేరి వద్ద ఘటన
22మంది మృతి, 59 మందికి గాయాలు
దాడి మా పనే: ఐసిస్

లండన్, మే 23: బ్రిటన్‌లోని ప్రముఖ పారిశ్రామిక నగరం మాంచెస్టర్‌లో సోమవారం రాత్రి జరిగిన బాంబు దాడిలో కనీసం 22 మంది మృతి చెందగా, మరో 59 మంది గాయపడ్డారు. మృతుల్లో చాలామంది చిన్న పిల్లలున్నారు. అమెరికా పాప్ స్టార్ ఆరియానా గ్రాండే పాప్ కచేరి జరుగుతున్న మాంచెస్టర్ ఎరీనా వెలుపల భారీ తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలతో వచ్చిన ఒక వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. కాగా, మాంచెస్టర్ ఆత్మాహుతి దాడి తమపనేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.35 గంటల సమయంలో కచేరి ముగిసి అందరూ బైటికి వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు ఘటనలో 22 మంది చనిపోగా,59 మంది గాయపడినట్లు పోలీసులు చెప్తూ, క్షతగాత్రులు నగరంలోని ఎనిమిది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. తాము దీన్ని ఉగ్రవాద ఘటనగానే పరిగణిస్తున్నామని, దాడికి పాల్పడింది ఒకే వ్యక్తి అని కూడా తాము నమ్ముతున్నామని మాంచెస్టర్ నగర పోలీసు చీఫ్ ఇయాన్ హాప్‌కిన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి ఎరీనా వద్దనే చనిపోయినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అంతేకాదు దాడి చేసిన వ్యక్తి వద్ద అత్యంత శక్తివంతమైన ఐఇడి ఉండిందని, అందువల్లనే ఇంత భారీ పేలుడు సంభవించిందని కూడా వారు చెప్పారు. మృతదేహం ఆధారంగా దాడి చేసిన వ్యక్తిని గుర్తించడానికి యత్నిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది చిన్నారులున్నారని, గ్రాండే అభిమానుల్లో అధిక శాతం వారే కావడమే దీనికి కారణమని వారు చెప్పారు. కాగా, దాడితో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న 23 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు కూడా పోలీసులు తెలిపారు.
2005 లండన్ బాంబు దాడి తర్వాత బ్రిటన్‌లో ఇంత భారీ బాంబు దాడి జరగడం ఇదే మొదటిసారి. కాగా, ఈ ఘటనలో భారతీయులెవరైనా మృతి చెందారా అనే విషయాన్ని నిర్ధారించుకుంటున్నామని న్యూఢిల్లీలో అధికార వర్గాలు తెలిపారు. అంతేకాకుండా ఎవరైనా గాయపడి ఉంటే వారు వీలయినంత త్వరగా భారత దౌత్య కార్యాలయానికి తెలియజేయాలని కూడా వారు కోరారు. బాంబు పేలుడును బ్రిటీష్ ప్రధాని థెరెసా మే తీవ్రంగా ఖండించారు. పేలుడు వార్త తెలియగానే ఆమె ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే నిలిపి వేసి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. అంతమంది యువకులను పొట్టన పెట్టుకున్న వారికి రోజులు దగ్గరపడ్డాయని ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అధ్యక్షుడు మహముద్ అబ్బాస్‌తో సమావేశం అనంతరం ట్రంప్ అన్నారు.
దాదాపు 21 వేల కెపాసిటీ ఉన్న ఎరీనా వెలుపలి ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆరియానా గ్రాండే కచేరి ముగించి స్టేజి దిగి వెళ్లిన తర్వాత భారీ పేలుడు శబ్దం వినిపించిందని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. గ్రాండే క్షేమంగా ఉన్నట్లు ఆమె ప్రతినిధి చెప్పారు. పేలుడు వార్తతెలిసి తన గుండెలు బద్దలయ్యాలని, మాటలు రావడం లేదని గ్రాండె ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సంఘటన తర్వాత తన ప్రపంచ పర్యటనను ఆమె వాయిదా వేసుకున్నట్లు ఆమె కచేరిల నిర్వాహకులు ప్రకటించారు.
chitram...
మాంచెస్టర్ ఎరీనా వెలుపల ఐసిస్ జరిపిన ఆత్మాహుతి దాడిలో చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు