అంతర్జాతీయం

కంచెకడతాం.. సాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 9: ఉగ్రవాదాన్ని అరికట్టాలంటే తమ దేశానికి, ఆఫ్ఘాన్‌కు మధ్య వివాదాస్పదంగావున్న సరిహద్దుకు కంచె వేయాల్సిందేనని పాకిస్తాన్ స్పష్టం చేసింది. అయితే ఇందుకయ్యే ఖర్చును అమెరికా భరించాలని కూడా మెలిక పెట్టింది. ఆఫ్ఘాన్, పాక్‌ల మధ్య దాదాపు 2340 కిలోమీటర్ల మేర పర్వతమయమైన సరిహద్దు ప్రాంతం ఉంది. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఇప్పటి వరకూ పది శాతం కూడా కంచె నిర్మాణం పూర్తికాలేదు. 2019 చివరి నాటికి దీని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ స్పష్టం చేస్తున్నప్పటికీ, అది ఎంతమేరకు సాధ్యమో అంతపట్టడం లేదు. కంచె నిర్మాణం కంటే కూడా ఆఫ్ఘాన్ ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు తమకు తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందని ఆసిఫ్ తెలిపారు. మరోపక్క అమెరికా నుంచి కూడా మిలిటెంట్ సంస్థలను అడ్డుకోవాలంటూ పాక్‌పైనా వత్తిడి పెరుగుతోంది.
ముఖ్యంగా తాలిబాన్, హక్కానీ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయాలంటూ పదే పదే అమెరికా అధ్యయుడు ట్రంప్ పాక్‌ను ఆదేశించారు. అంతేకాదు, తమ ఆదేశాల సక్రమంగా అమలు చేయడం లేదంటూ పాక్‌పై కనె్నర్ర చేసిన ఆయన 2 బిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని కూడా నిలిపివేశారు. అయితే అఫ్గాన్‌తో తమకున్న సరిహద్దును పూర్తిగా మూసివేస్తే తప్ప ఉగ్రవాద సమస్య తీరదని చెబుతున్న పాక్, ఇందుకోసం అయ్యే ఖర్చును అమెరికా కూడా భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రోజువారీగా దాదాపు 70వేల మంది ఈ సరిహద్దును దాటి పాక్‌లోకి వస్తున్నారని, ఎవరినీ అదుపుచేయలేని పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. అమెరికాతో తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నామని పేర్కొన్న ఆయన, ఉగ్రవాదులను అణచివేసే విషయంలో తమనుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. అయితే ఉగ్రవాద సమస్య విషయంలో ఆఫ్గాన్, పాక్‌లు పరస్పరం నిందలు వేసుకుంటున్నాయి. ఈ విషయంలో తమ తప్పు లేదంటే తమ తప్పేలేదని వాదోపవాదాలకు దిగుతున్నాయి. తమ దేశంలో అకారణంగా యుద్ధం ప్రకటిస్తున్నది పాకిస్తానేనని ఆఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణ కూడా తప్పదన్న సంకేతాలు అందించారు.