జాతీయ వార్తలు

నైజీరియాలో నరమేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానొ (నైజీరియా), ఫిబ్రవరి 16: ఉత్తర నైజీరియా ప్రాంతంలో బందిపోటు దొంగలు రక్తపాతం సృష్టించారు. ఈ సాయుధ ముఠా విచక్షణారహితంగా దాడులు జరిపి డజన్ల సంఖ్యలో స్థానిక ప్రజలను హతమార్చిందని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. పశ్చిమాసియాలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న నైజీరియాలో ఇటీవలి కాలంలో ఈ రకమైన దాడులు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. కిడ్నాప్ గ్యాంగ్‌కు స్థానికులకు మధ్య గత కొంతకాలంగా తీవ్రస్థాయిలోనే ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జుర్మీ ప్రాంతంలో ఈ తాజా నరమేధం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పశుగణాలను ఎత్తుకుపోతున్న ముఠాలతో స్థానికులకు నిరంతరం ఘర్షణ పరిస్థితి నెలకొంటూనే వస్తోందని ఈ బందిపోటు దొంగలు దాడులు చేయడంతోపాటు ఇళ్లను తగులబెట్టడం విచక్షణారహితంగా స్థానిక ప్రజలను హతమార్చడం వంటి ఘాతుకాలకు పాల్పడుతూనే ఉన్నారని వెల్లడించారు. ఫలితంగా తమను తాము రక్షించుకునేందుకు ప్రజలే రక్షక దళాలుగా ఏర్పడ్డారని తాజాగా జరిగిన దాడిలో దాదాపు 36మంది వరకు మరణించి ఉండవచ్చునని పోలీసులు వెల్లడించారు. ఈ బందిపోటు ముఠా ట్రక్కులపై దాడులు జరిపి ఈ దాడికి పాల్పడిందని, అందులోని ప్రతి ఒక్కరిని హతమార్చిందని పోలీసులు తెలిపారు. అనంతరం సమీపంలోని గ్రామంలోకి చొరబడి తీవ్రస్థాయిలో దోపిడీలు జరిపారని పేర్కొన్నారు. మృతులందరికీ సామూహిక అంత్యక్రియలు నిర్వహించినట్లు స్థానికులు వెల్లడించారు.