అంతర్జాతీయం

సిరియా వ్యతిరేక శక్తుల చేతిలో ఐరాస కీలుబొమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, ఏప్రిల్ 11: ‘అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికే ఐక్యరాజ్య సమితి యత్నిస్తోంది. ఐరాస సిరియా వ్యతిరేక శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారింది. ఒక సర్వసత్తాక రాజ్యంపై, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు తీర్పు చెప్పడం సిగ్గుచేటు’ అం టూ ఐక్యరాజ్య సమితిలో రష్యా ప్రతినిధి వాసిల్లీ నెబెంజియా విమర్శించారు. సిరియాలో అమాయకులపై రసాయన ఆయుధాలను ఎవరు ప్రయోగించారన్న దానిపై విచా రణ జరిపేందుకు వీలుకల్పించే తీర్మానం ఐక్యరాజ్య సమి తి భద్రతామండలి ఆమోదానికి నోచుకోలేదు. ముఖ్యంగా రష్యా వీటో చేయడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో పాటు మరో రెండు తీర్మానాలు కూడా అమోదం పొందకపోవడం గమనార్హం. మంగళవారం ఐరాస భద్రతా మండ లి మొత్తం మూడు తీర్మానాలను ప్రవేశపెట్టగా, మూడూ తి రస్కరణకు గురయ్యాయి. మొదటి ముసాయిదా (రసాయన ఆయుధాల ప్రయోగంపై) అమెరికా ప్రవేశపెట్టింది. దీనికి అనుకూలం గా 12 ఓట్లు రాగా, రెండు దేశాలు (ర ష్యా, బొలీవియా) వ్యతిరేకించాయి. చైనా తటస్థంగా ఉం డిపోయింది. ఈ సందర్భంగా వాసిల్లీ నెబెంజియా మాట్లా డుతూ సదస్సులో నిర్దేశించిన ప్రమాణాలతో పనిలేకుండా, అమెరికా ప్రతిపాదించే యంత్రాంగం విచారణ జరుపుతుందని దుయ్యబట్టారు.
అసఒద్ ప్రభుత్వానికి రష్యా, ఇరాన్ రక్షణ : నిక్కీహేలీ
కాగా సిరియాకు వ్యతిరేకంగా చేపట్టిన తీర్మానాలను రష్యా వీటో చేయడం ఇది 12వ సారి. మరోవైపు ఈ తీర్మానం ఆమోదం పొందకపోవడం పై ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ ‘అసాద్ ప్రభుత్వాన్ని రష్యా, ఇరాన్‌లు కాపాడుతున్నాయి’ అంటూ విమర్శించారు. రష్యా ఫెడరేషన్‌తో చర్చలు జరిపి వారి అభిప్రాయాలను కూడా ముసాయిదా లో చేర్చినా ఆమోదించకపోవడం విచిత్రమన్నారు.
సిరియా రాజధాని డెమాస్కస్ శివారు ప్రాంతమైన దౌ మాపై రసాయన ఆయుధాల దాడి జరిగిందన్న వార్తలు వెలువడిన తర్వాత ఐరాస సమావేశమైంది. కాగా ఈ తీర్మానానికి పోటీగా రష్యా మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీ ని ప్రకారం సిరియా విషయంలో ఒక స్వతంత్ర యంత్రాం గం ఏర్పాటు చేయాలి. ఏడాది కాలంలో అసలు సిరియా లో రసాయన ఆయుధాలను ఎవరు ప్రయోగిస్తున్నారనేదా న్ని గుర్తించే బాధ్యత ఐరాసకు ఈ తీర్మానం కట్టబెడుతోం ది. అయితే ఈ తీర్మానం కూడా ఆమోదానికి నోచుకోలేదు. దీనికి అనుకూలంగా ఆరు దేశాలు దీనికి మద్దతు తెలుపగా, ఏడు దేశాలు దీన్ని వ్యతిరేకించాయి. రెండు దేశాలు తటస్థంగా ఉండిపోయాయి. ఇక రష్యా ప్రవేశపెట్టిన ఓపీసీడబ్ల్యు-నిజ నిర్ధారణ మిషన్‌కు సంబంధించిన మూడో తీర్మానం కూడా ఐరాస ఆమోదానికి నోచుకోలేదు.

చిత్రం: ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతున్న రష్యా ప్రతినిధి వాసిల్లీ నెబెంజియా