జాతీయ వార్తలు

ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, నవంబర్ 25: నియంత్రణ రేఖకు సమీపంలో జమ్మూకాశ్మీర్‌లోని తంఘ్‌దర్ సెక్టర్‌లోని ఒక సైనిక శిబిరంపై బుధవారం ఉగ్రవాదులు దాడికి దిగారు. తేరుకున్న భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఏడు గంటల పాటు జరిగిన ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాలు ఆ ముగ్గురు ముష్కరులను హతమార్చాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక పౌరుడు కూడా మృతి చెందినట్లు ఆర్మీ తెలిపింది. ఒక సైనికుడు గాయపడ్డాడు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి గల ముగ్గురు ఉగ్రవాదులు ఉదయం 6.15 గంటలకు వెనుక భాగం నుంచి ఆర్మీ క్యాంపులోకి ప్రవేశించి, విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల వల్ల కొన్ని వాహనాలకు నిప్పు అంటుకున్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. భారీగా ఆయుధాలు గల ముగ్గురు ఉగ్రవాదులు చిన్న ఆయుధాలతో పాటు యుబిజిఎల్ వెపన్లతో దాడికి దిగారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుదాడికి దిగాయి. సుమారు ఏడు గంటల పాటు ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర స్థాయిలో కాల్పులు జరిగాయి. ఈ పోరులో భద్రతా బలగాలు మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి.
తంఘదర్ సెక్టర్ కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖకు సమీపంలో ఉంది. గతంలో ఉగ్రవాదులు పాకిస్తాన్ వైపు నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ఈ సెక్టర్‌ను ఉపయోగించుకునేవారు. ఎదురుకాల్పుల అనంతరం సంఘటన స్థలంలో ఉగ్రవాదుల మృతదేహాల వద్ద గల మూడు ఎకె అసాల్ట్ రైఫిళ్లతోపాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సైనికాధికారి ఒకరు చెప్పారు. ఈ సెక్టర్‌లో మరింత మంది ఉగ్రవాదులు ఉన్నారా? అనే కోణంలో సైన్యం గాలింపు చర్యలు జరుపుతోందని ఆ అధికారి వివరించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించినట్లు సమాచారం. స్థానిక వార్తాసంస్థకు ఒక వ్యక్తి ఫోన్ చేసి, తనను తాను జైషే మొహమ్మద్ అధికార ప్రతినిధిగా పరిచయం చేసుకోవడంతో పాటు ఆర్మీ క్యాంప్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు తమ సంస్థకు చెందినవారేనని చెప్పాడు. అయితే ఉగ్రవాదుల బృందం భారత్‌లోకి చొరబడేందుకు వీలుగా ఈ ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపారా? అనేది స్పష్టం కాలేదని ఆర్మీ అధికారులు తెలిపారు. దర్యాప్తు తరువాత ఈ విషయం వెల్లడవుతుందని పేర్కొన్నారు.
chitram..
ఉగ్రవాదుల దాడి అనంతరం ఆ ప్రాంతంలో పహరాను ముమ్మరం చేసిన జవాన్లు