అంతర్జాతీయం

రూ. 78 లక్షలు పలికిన ట్యూనా చేప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, జనవరి 5: జపాన్ రాజధాని టోక్యోలోని ట్సుకిజి చేపల మార్కెట్లో ప్రతి ఏటా నిర్వహించే కొత్త సంవత్సరాది వేలంలో అంతరించి పోతున్న జాతుల్లో ఒకటైనా అరుదైన బ్లూఫిన్ ట్యూనా చేపను ప్రముఖ సుషి రెస్టారెంట్ చైన్ యజమాని లక్షా 17 వేల డాలర్లకు(78 లక్షల రూపాయలకు) కొనుగోలు చేసాడు. 220 కిలోలు(440 పౌండ్లు) బరువుండే ఈ చేపకు వేలంలో కోటీ 40 లక్షల యెన్‌లు పలికిన తర్వాత వేలం పాటను ఆపేసారు.
జపాన్ ఉత్తర సముద్ర తీరంలో ఈ చేప దొరికింది. గత ఏడాది ట్యూనా చేపకు పలికిన ధరకన్నా ఇది మూడు రెట్లు ఎక్కువ. అయితే 2013లో పలికిన రికార్డు ధరకన్నా తక్కువే. అప్పట్లో దీనికన్నా కాస్త ఎక్కువ బరువుండే ఇదే రకమైన చేపకు 15.54 కోట్ల యెన్‌ల రికార్డు ధర పలికింది. ట్సుకిజి ఫిష్ మార్కెట్లో ప్రతి ఏటా కొత్త సంవత్సరం సందర్భంగా అరుదైన బ్లూఫిన్ ట్యూనా చేపలను వేలం వేస్తారు. సంపన్నులు ప్రతిష్ఠ కోసం అధిక ధర చెల్లించి ఈ చేపలను సొంతం చేసుకుంటారు. అయితే ఇప్పటికే ఈ రకం అంతరించి పోయే జాతుల్లోకి చేరుకుందని, ఇంత భారీ ధరలను చెల్లించి వీటిని సొంతం చేసుకోవడం ఇలాగే కొనసాగితే మరికొద్ది సంవత్సరాల్లోనే ఈ జాతి పూర్తిగా కనుమరుగై పోతుందని ప్రపంచ ట్యూనా పరిరక్షణ అసోసియేషన్ వాపోయింది. అయితే ఈ చేపను సొంతం చేసుకున్న కియోషి కిమురా మాత్రం ట్సుకిజిలో నిర్వహించే చిట్టచివరి న్యూఇయర్ వేలంలో ఈ చేపను సొంతం చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అంటున్నాడు. విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శించే ట్సుకిజి చేపల మార్కెట్లో వందలాది చిన్న చిన్న దుటాణాలు, హోల్ సేల్ దుకాణాలున్నాయి. 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మార్కెట్‌ను కొన్ని మైళ్ల దూరంలోని టోయోసులో నిర్మించిన ఆధునిక భవన సముదాయంలోకి మారుస్తున్నారు.

ఓ రెస్టారెంట్ యజమాని రూ.78 లక్షలకు వేలంలో దక్కించుకున్న బ్లూఫిన్ ట్యూనా చేప