అంతర్జాతీయం

కన్నీళ్లు పెట్టుకున్న ఒబామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జనవరి 6:. అమెరికాలో పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతిని అదుపు చేసి తీరాలన్న కృతనిశ్చయంతో ఉన్న ఒబామా బలమైన గన్‌లాబీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ (పార్లమెంటు) మద్దతును కూడగట్టడానికి న్యూటౌన్‌లో ఓ పాఠశాల చిన్నారుల మూకుమ్మడి హత్యాకాండను, ఓక్‌క్రీక్‌లో ప్రార్థనలు చేస్తున్న సిక్కులపై జరిగిన కాల్పుల ఘటనలను గుర్తు చేసుకొంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. తుపాకీ సంస్కృతిని కంట్రోల్ చేయడానికి ఒబామా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్ష రిపబ్లికన్ల కంట్రోల్‌లో ఉన్న కాంగ్రెస్‌నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయడానికి మంగళవారం అనేక చర్యలను ప్రకటించిన ఒబామా కాంగ్రెస్ మద్దతున్నా లేకున్నా ఈ రక్తపాతాన్ని ఆపి తీరుతామని వైట్‌హౌస్ తూర్పుగదిలో మూకుమ్మడి హత్యాకాండల్లో మరణించిన వారి బంధువుల సమక్షంలో ఒబామా అన్నారు. ‘రెండో సవరణకు సంబంధించిన హక్కులు ముఖ్యమైనవే. అయితే మనం పట్టించుకోవలసి ఇతర హక్కులు కూడా ఉన్నాయి. మనం వాటిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు స్వేచ్ఛగా, సురక్షితంగా ప్రార్థన చేసుకునే హక్కు మనకు ఉంది. అయితే కాన్సాస్ సిటీలో యూదులకు, చార్ల్‌స్టన్‌లో క్రైస్తవులకు, చాపెల్ హిల్‌లో ముస్లింలకు, ఓక్ క్రీక్‌లో సిక్కులకు ఆ హక్కును లేకుండా చేసారు. అలాగే స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, సంతోషంగా జీవించడానికి మనకున్న తిరుగులేని హక్కులను కూడా లేకుండా చేసారు’ అని బ్లాక్‌బర్గ్, శాంటా బర్బరాలో కాలేజి విద్యార్థుల హత్యాకాండను, కొలంబిన్‌లో పాఠశాల విద్యార్థులు, న్యూటౌన్‌లో ఎలిమెంటరీ పాఠశాల చిన్నారుల మూకుమ్మడి హత్యాకాండను గుర్తు చేసుకుంటూ ఒబామా అన్నారు. మూడేళ్ల క్రితం న్యూటౌన్‌లో 20 మంది ఎలిమెంటరీ స్కూలు చిన్నారుల మూకుమ్మడి హత్యాకాండను గుర్తు చేసుకుంటూ, ‘ఆ చిన్నారుల గురించి ఆలోచించిన ప్రతిసారీ నేను పిచ్చివాడినై పోతాను’ అని ఒబామా కన్నీళ్లను తుడుచుకుంటూ అన్నారు. అంతేకాదు తన ఉద్వేగాన్ని ఆపుకోవడానికి ఒక క్షణం ఆగారు. అందువల్ల గన్ లాబీ చెబుతున్న అబద్ధాలకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలవాలని మనమంతా కాంగ్రెస్‌ను డిమాండ్ చేద్దామని ఆయన అన్నారు. అధ్యక్షుడిగా తనకున్న విశేషాధికారాలతో విచ్చలవిడిగా జరుగుతున్న తుపాకీల అమ్మకాలను అదుపు చేయడానికి పలు చర్యలను ప్రకటించిన ఒబామా, ఈ వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైసెన్సు తీసుకుని తీరాలని, అలాగే ఆయుధాలు కొనుగోలు చేసే వారి గత చరిత్రను చెక్ చేయాలని అంటూ, లేని పక్షంలో వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇలాంటి మారణకాండకు పాల్పతూ మానసిక వ్యాధితో బాధపడుతున్న వారికి అవసరమైన సాయం చేయడానికి కూడా తాము మరిన్ని చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు.
chitram...
వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా