అంతర్జాతీయం

వందకు పైగానే భూమిని పోలిన గ్రహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 10: మన సౌర వ్యవస్థ ఆవల వందల వేల సంఖ్యలో ఉన్న గ్రహాలను, నక్షత్రాలను గుర్తించి ఎప్పటికప్పుడు వాటి వివరాలను వెల్లడిస్తున్న కెప్లర్ వ్యోమనౌక ఇప్పటివరకు భూమిని పోలిన వంద కొత్త గ్రహాలను గుర్తించింది. అనేక నక్షత్రాల చుట్టూ వందకుపైగా ఈ గ్రహాలు పరిభ్రమిస్తున్నాయని కెప్లర్ అందించిన వివరాల ఆధారంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. ఈ వంద గ్రహాల ఉనికిని కెప్లర్ వ్యోమనౌక ధ్రువీకరించిందని నాసా తెలిపింది. అయితే 2013లో ఈ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అది అనుకున్న స్థాయిలో పనిచేయలేదు. అన్ని విధాలుగా దానికి మరమ్మతులు చేసిన నాసా మరిన్ని కొత్త గ్రహాల అనే్వషణ దిశగా ముందుకు సాగుతోంది. అంతరిక్షంతలో పరిభ్రమిస్తున్న గ్రహాలను గుర్తించడం, వాటి పరిమాణాన్ని నిర్ధారించే విషయంలో కెప్లర్ వినూత్న విధానాన్ని అనుసరించింది. ఒక నక్షత్రం చుట్టూ ఒక గ్రహం పరిభ్రమించేటప్పుడు దాని కాంతిలో వచ్చే తేడాను ప్రాతిపదికగా చేసుకునే ఈ రకమైన గ్రహాలన్నింటినీ గుర్తించింది. కేవలం రోదసీలో ఉన్న గ్రహాలను గుర్తించాలన్న లక్ష్యంతోనే కెప్లర్ వ్యోమనౌకను నాసా ప్రయోగించింది. రెండేళ్ల క్రితం ఎప్పుడైతే ఇందులో సాంకేతిక లోపం తలెత్తిందో అందులోని టెలిస్కోప్‌ను మాత్రం సురక్షితంగా ఉంచగలిగారు. దీనికోసం సోలార్ రేడియేషన్ పీడన ప్రక్రియను ఉపయోగించారు. వివిధ నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తున్నవి గ్రహాలా లేక ఇతర రోదసీ పదార్థాలా అన్న విషయంలో అధ్యయనం జరిపామని, ఇవి కచ్చితంగా గ్రహాలేనని చెప్పడానికి ఎన్నో ఆధారాలు లభించాయని అరిజోనా యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్తవ్రేత్త ఇయాన్ క్రాస్‌ఫీల్డ్ తెలిపారు. ఇప్పటివరకు 6వేల నక్షత్రాలను కెప్లర్ పరిశీలించిందని తెలిపారు. 2009లో కెప్లర్ వ్యోమనౌకను నాసా ప్రయోగించింది. మన పాలపుంతలో భూమిని పోలిన గ్రహాలు ఎన్ని ఉన్నాయన్న విషయాన్ని నిర్ధారించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు వందకుపైగా గ్రహాంతర ప్రపంచాలను కెప్లర్ గుర్తించగలిగింది.