అంతర్జాతీయం

పాక్‌లో ఆత్మాహుతి దాడి 15 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జనవరి 13: పాకిస్తాన్‌లో ప్రధాన నగరాల్లో ఒకటైన క్వెట్టాలో తాలిబన్ ఆత్మాహుతి దాడిలో 15 మంది మరణించారు. బెలోచిస్థాన్ రాజధాని నగరమైన క్వెట్టాలోని పోలియో కేంద్రం వెలుపల ఈ ఘాతుకం చోటుచేసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది భద్రతాధికారులేనని తెలిసింది. పోలియో నిర్మూలనలో భాగంగా బెలోచిస్థాన్ అంతటా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాజధాని క్వెట్టాలోని పోలియో చుక్కల మందు శిబిరం వద్ద ఆరోగ్య కార్యకర్తలు విధి నిర్వహణలో ఉన్నారు. శిబిరం వద్ద ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా పోలియో కేంద్రం వద్ద భద్రతా అధికారులు నిలబడ్డారు. ఈ సమయంలో తాలిబన్ మానవబాంబు పేలిందని బెలోచిస్థాన్ హోమ్ మంత్రి మిర్ సర్ఫరాజ్ బుగ్తీ వెల్లడించారు. తాలిబన్ తీవ్రవాది శరీరం తునాతునకలైపోయింది. బాంబు దాడిలో చనిపోయినవారిలో 12మంది భద్రతాధికారులేనని డాన్ వార్తా సంస్థ స్పష్టం చేసింది. మిగతా ముగ్గురిలో ఒకరు పారామిలటరీ అధికారి, మరో ఇద్దరు పౌరులని అన్నారు. ఇలా ఉండగా పోలియో కేంద్రం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ (టిటిపి) ప్రకటించుకుంది. ఈ మేరకు టిటిపి మీడియాకు ఇ-మెయిల్స్ పంపించింది. క్వెట్టా డిఐజి సయ్యద్ ఇంతియాజ్ షా పేలుళ్లకు ఏడెనిమిది కిలోల పేలుడు పదార్థం వాడినట్టు చెప్పారు. పేలుడు తరువాత ఆ ప్రాంతమంతా పెద్దఎత్తున మంటలు లేచాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుళ్ల ధాటికి పోలియో కేంద్రం సమీపంలోని భవనాల అద్దాలు పగిలిపోయాయి. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆత్మాహుతి దాడి నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సైన్యం ఆధీనంలోకి తీసుకున్నారు. ఎమర్జెన్సీ విధించారు. పేలుళ్ల నేపథ్యంలో క్వెట్టాలో పల్స్‌పోలియో కార్యక్రమం తాత్కాలికంగా రద్దుచేశారు. ఐదేళ్ల లోపు పిల్లలు 2.4 మిలియన్ల మందికి పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుని ఈ కార్యక్రమం చేపట్టింది.

ఇందులో భాగంగా అఫ్గాన్ శరణార్థుల పిల్లలు 55వేల మందికి పోలియో చుక్కుల వేయాలని భావించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఇస్లామిక్ గ్రూపు, తాలిబన్ మిలిటెంట్లు వ్యతిరేకిస్తున్నారు.
chitram..
బుధవారం బాంబు పేలిన స్థలంలో ఆధారాలు సేకరిస్తున్న పాక్ పోలీసులు