అంతర్జాతీయం

రోదసిలో పూసిన తొలి పూవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 17: అంతరిక్షంలో మొట్టమొదటిసారిగా ఒక పువ్వును విజయవంతంగా పూయించి అమెరికా వ్యోమగామి స్కాట్ కెల్లీ చరిత్ర సృష్టించాడు. అమెరికా దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే ఆరంజ్ జినియా పువ్వును కెల్లీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో విజయవంతంగా పెంచడమే కాదు, పూర్తిస్థాయిలో వికసించేలా చేసాడు. తాను సాధించిన విజయాన్ని కెల్లీ ట్విట్టర్‌లో ఆనందంగా భూమిమీద ఉన్న అందరికీ తెలియజేయడమే కాకుండా ఆ జినియా పూవు ఫోటోలను కూడా ఉంచాడు. ‘అంతరిక్షంలో ఇతర జీవ రూపాలు కూడా ఉన్నాయి. అంతరిక్షంలో మొట్టమొదటగా పెంచిన పూవు చరిత్ర సృష్టించింది’ అని కూడా ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని సిబ్బంది ఇంతకు ముందు ఆకులే పువ్వులుగా ఉండే కాలీఫ్లవర్‌లాంటి వాటిని పెంచి తిన్నారు కూడా. అయితే ఒక పూల మొక్కను పెంచి పువ్వు పూసేలా చేయడం ఇదే మొదటిసారి. రాబోయే రోజుల్లో అంతరిక్ష యాత్రల్లో దీని ప్రభావం ఎంతో ఉండనుంది. మానవులు భూమికి దూరంగా వెళ్లే కొద్దీ ఆహార మొక్కలను పెంచాల్సిన, వాతావరణ రీసైక్లింగ్ చేయడం, వాటివల్ల భౌతిక ప్రయోజనాలను పొందాల్సిన అవసరం ఎంతయినా ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా కెన్నడీ స్పేస్ సెంటర్‌లో ‘వెజ్జీ’ కార్యక్రమానికి చెందిన పే లోడ్ సైంటిస్టు జియోయియా మస్సా 2014 మేలోనే చెప్పారు. దీర్ఘకాలం అంతరిక్ష పరిశోధనలు జరపాల్సిన పరిస్థితుల్లో మొక్కల పెంపకం అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుందని తాను భావిస్తున్నట్లు మస్సా చెప్పారు. ‘వెజ్జీ’ అనేది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన ఒక సిస్టమ్. గత జూన్‌లో దీన్ని ఐఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసారు. దీంతో అంతరిక్ష యాత్రికులు ఐఎస్‌ఎస్‌పైన మొక్కలను పెంచడానికి వీలవుతుంది. పువ్వులు పెరగడానికి అది ఎరుపు, నీలం, ఆకుపచ్చ ఎల్‌ఇడి లైట్లతో కూడిన సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. జినియా పూవును పెంచడం వల్ల వెజ్జీ పెంపకం విధానంలో పూల మొక్కలు ఎలా పెరుగుతాయో తెలుసుకోవడానికి తోడ్పడ్డమే కాక భవిష్యత్తులో టమోటాలాంటి పండ్ల మొక్కలను పెంచడానికి వీలవుతుందని కెన్నడీ స్పేస్ సెంటర్‌కు చెందిన ప్రోగ్రామ్ మేనేజర్ ట్రెంట్ స్మిత్ గత ఏడాది అన్నారు.
chitram...
రోదసిలో పూసిన ఆరంజ్ జినియా పువ్వు