అంతర్జాతీయం

ఐసిస్‌కు భారీ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 20: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు మరో దెబ్బ తగిలింది. అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటికే ఎంతో ఆర్థిక నష్టాన్ని చవిచూసిన ఐసిస్ మంగళవారం అర్ధరాత్రి జరిగిన వైమానిక దాడుల్లో 45 మిలియన్ అమెరికా డాలర్ల నగదు ధ్వంసమైంది. ఇంతటి భారీ నష్టం ఎదురుకావడం వారంలో ఇది రెండోసారి. ఈ నెల 10న జరిగిన వైమానిక దాడుల్లో 90 మిలియన్ డాలర్లను అమెరికా ఫైటర్లు ధ్వంసం చేయగలిగారు. ఇరాక్‌లోని వౌసుల్ నగరంలో ఉన్న ఐసిస్ బ్యాంక్‌ను ధ్వంసం చేసినట్లు అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. భారీ నగదు నిల్వలు కలిగిన ఈ బ్యాంక్‌పై ఈ నెల 10న 900 కిలోల బాంబుతో దాడిచేసి ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఐసిస్ బ్యాంక్‌లుగా పిలవబడుతున్న ఈ నగదు కేంద్రాల్లో భారీగా నగదు నిల్వలను సమకూర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి జరిపిన దాడుల్లో అమెరికా డాలర్లు, దినార్లు భారీగా నిల్వవుంచినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఐసిస్‌ను తుదముట్టించేందుకు ఉమ్మడిగా దాడులు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. నగదు నిల్వలను భారీగా నష్టపోతున్న ఐసిస్ తమ ఫైటర్లకు ఇచ్చే జీతాల్లో కోత వేసిన విషయం తెలిసిందే. 1.5 మిలియన్ సున్నీలు నివసించే వౌసుల్ పట్టణాన్ని సుమారు రెండువేలమంది ఐసిస్ ఫైటర్లు స్వాధీనం చేసుకున్నట్లు ఇరాక్ మిలిటరీ అధికారులు అంచనా వేస్తున్నారు.