అంతర్జాతీయం

పెన్ను వదలి.. గన్ను పట్టాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెషావర్, జనవరి 20: ఉగ్రవాదులనుంచి తన విద్యార్థులను కాపాడుకోవడానికి తన ప్రాణాలనే పణంగా పెట్టిన ఓ అధ్యాపకుడి వీరగాథ ఇది. పాకిస్తాన్‌లోని చర్సద్దాలో గల బచ్చాఖాన్ విశ్వవిద్యాలయాన్ని బుధవారం తాలిబన్ ఉగ్రవాదులు ముట్టడించి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నప్పుడు భవనంలోనుంచి బయటకు వెళ్లకూడదని తన విద్యార్థులను అప్రమత్తం చేసిన రసాయన శాస్త్రం బోధించే అసిస్టెంట్ ప్రొఫెసర్ సయ్యద్ హమీద్ హుస్సేన్ (34) తన లైసెన్స్‌డ్ పిస్టల్‌తో సాయుధ ఉగ్రవాదులపైకి ఎదురుకాల్పులు జరిపారు. అయితే కొద్ది సేపటికే ముష్కర మూకలు జరిపిన కాల్పుల్లో ఆయన నేలకూలారు. ఉగ్రవాదుల తూటాలకు బలయిన 24మందితో పాటు విద్యార్థులను కాపాడడానికి ఉగ్రవాదులపైకి తిరగబడిన హమీద్ హుస్సేన్ వీరమరణం పొందారు. ఉగ్రవాదుల మొదటి తూటా చప్పుడు వినగానే భవనంలోంచి బయటకు వెళ్లొద్దని తమ కెమిస్ట్రీ లెక్చరర్ తనను హెచ్చరించారని జహూర్ అహ్మద్ అనే విద్యార్థి చెప్పాడు. తమ లెక్చరర్ పిస్టల్‌ను పట్టుకోవడాన్ని తాను చూశానని, తరువాత ఒక బుల్లెట్ అతనికి తగలడం చూశానని అహ్మద్ తెలిపాడు. ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండటాన్ని కూడా తాను చూశానని వివరించాడు.
ముగ్గురు ఉగ్రవాదులు నినాదాలిస్తూ తమ డిపార్ట్‌మెంట్ మెట్లవైపు పరుగెత్తుకుంటూ వస్తుండటాన్ని తాము చూశామని, తమ కెమిస్ట్రీ ప్రొఫెసర్ తన పిస్టల్‌తో ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపారని మరో విద్యార్థి తెలిపాడు. తమ ప్రొఫెసర్ కిందపడి పోవడం తాము చూశామని, ఉగ్రవాదులు రిజిస్ట్రార్ ఆఫీస్‌లోకి ప్రవేశించగానే తాము పారిపోయామని అతను వివరించాడు. మిలిటెంట్ల తూటాలకు హమీద్ బలయిన విషయాన్ని అధ్యక్షుడు మమ్‌నూన్ హుస్సేన్ ధ్రువీకరించారు. అనేక మంది నెటిజన్లు ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలలో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరమరణం పొందారని శ్లాఘిస్తూ ఆయనకు నివాళులు అర్పించారు.
chitram...

ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం