అంతర్జాతీయం

ప్రపంచమంతటా గణతంత్ర శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్/అడిలైడ్, జనవరి 26: ప్రపంచవ్యాప్తంగా భారత దౌత్య కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆగ్నేయాసియా దేశాల్లో ముఖ్యంగా బ్యాంకాక్, సింగపూర్, మలేసియా, ఫిలిప్పీన్స్, బ్రూనీ, మయన్మార్, లావోస్, కంబోడియా, వియత్నాం, ఇండోనేసియా దేశాల్లోని భారత దౌత్య కార్యాలయాల్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. బ్యాంకాక్‌లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి వణికిస్తున్నప్పటికీ లెక్కచేయకుండా వందలాది భారతీయులు భారత దౌత్య కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. భారత రాయబారి భగవంత్ సింగ్ బిష్ణోయి జాతీయ జెండాను ఎగురవేసి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించగా బిష్ణోయి వారికి బహుమతులు అందించారు. మిగతా దేశాల రాజధానుల్లోని భారత దౌత్య కార్యాలయాల్లో జరిగిన పతాకావిష్కరణ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు.
ఆస్ట్రేలియాలో గణతంత్ర దినోత్సవం, ఆస్ట్రేలియా జాతీయ దినం రెండూ ఒకేరోజు కావడంతో ఈ వేడుకలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దేశ రాజధాని కాన్‌బెర్రాలోని భారత దౌత్య కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భారత హైకమిషనర్ నవ్‌దీప్ సూరీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలనుంచి వచ్చిన భారతీయ సంతతికి చెందినవారు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.