అంతర్జాతీయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 2: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఇప్పటివరకు ముందంజలో ఉండిన డొనాల్డ్ ట్రంప్‌కు లోవా రాష్ట్రంలో చుక్కెదురైంది. రిపబ్లికన్ పార్టీ అభిమానుల (కాకస్) మధ్య జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీలో ఉన్న మరో అభ్యర్థి టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రుజ్ ట్రంప్‌పై భారీ ఆధిక్యత సాధించారు. క్రుజ్‌కు 28 శాతం ఓట్లు రాగా, ట్రంప్ 24 శాతం ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. మరో అభ్యర్థి మార్కో రుబియో 23 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. మరోవైపు డెమోక్రటిక్ పార్టీ శిబిరంలో అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం హిల్లరీ క్లింటన్, బెర్నీ శాండర్స్ మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్లుగా ఉంది. దాదాపు 99 శాతం ఓట్లు లెక్కించే సరికి హిల్లరీ క్లింటన్‌కు 50 శాతం ఓట్లు రాగా శాండర్స్‌కు 49 శాతం ఓట్లు వచ్చాయి.
కొన్ని వారాల క్రితంవరకు హిల్లరీ క్లింటన్‌కన్నా 20కన్నా ఎక్కువ పాయింట్లు వెనుకబడి ఉండిన శాండర్స్ ఇప్పుడామెకు దాదాపు సమానంగా ఓట్లు తెచ్చుకోవడంతో రానున్న రోజుల్లో పోటీ మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోవా రాష్ట్రంలో తాను రెండో స్థానంలో వస్తానని గత ఏడాది జూన్‌లో ప్రచారం ప్రారంభించినప్పుడు అనుకోలేదని ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ ట్రంప్ అన్నారు. అయితే తదుపరి ప్రైమరీ ఎన్నికలు జరిగే న్యూహాంప్‌షైర్, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో తాను విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కించుకుంటానన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కాగా, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వపు పోటీలో తాము విజయం సాధించి తీరుతామన్న విశ్వాసాన్ని అటు హిల్లరీ క్లింటన్, ఇటు శాండర్స్ ఇద్దరు కూడా వ్యక్తం చేశారు.