అంతర్జాతీయం

ప్రాజెక్టుల పురోగతిపై సంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఫిబ్రవరి 6: శ్రీలంకలో పర్యటిస్తున్న భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం ఆ దేశ అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేనతో సమావేశమై పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలను చర్చించారు. రెండు రోజుల పర్యటనకోసం శుక్రవారం ఇక్కడికి వచ్చిన సుష్మ అధ్యక్షుడు సిరిసేనతో జరిపిన సమావేశం చక్కగా సాగినట్లు శ్రీలంకలో భారత హైకమిషనర్ వైకె సిన్హా చెప్పారు వేల సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య ఉన్న నాగరికతాపరమైన బంధాన్ని అధ్యక్షుడు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారని ఆయన చెప్పారు. దాదాపు గంటసేపు సాగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు శ్రీలంకలో భారత్ చేపట్టిన వివిధ ప్రాజెక్టులు, ఇంతకు ముందు ఉన్నతస్థాయి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు. శ్రీలంకలో భారత్ చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పురోగతిపై ఇరువురూ సంతృప్తి వ్యక్తం చేశారని, భారత్ అందిస్తున్న సాయానికి సిరిసేన కృతజ్ఞతలు తెలిజేశారని సిన్హా చెప్పారు. ఇరువురు నేతలు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలను చర్చించినట్లు కూడా ఆయన తెలిపారు.
శుక్రవారం ఇక్కడ జరిగిన సంయుక్త కమిషన్ 9వ సమావేశం సాధించిన పురోగతిని కూడా వారు సమీక్షించారు. సుష్మాస్వరాజ్ అనంతరం శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రికా బండారునాయకె కుమారతుంగతో భేటీ అయ్యారు. అనంతరం సుష్మాస్వరాజ్ శ్రీలంకలో ప్రధాన తమిళ పార్టీ అయిన టిఎన్‌ఏ నేతలతో సమావేశమయ్యారు.
టిఎన్‌ఏ అధ్యక్షుడు ఆర్ సంపంథన్ నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన నేతలు సుష్మతో భేటీ అయి శ్రీలంకలో మైనారిటీ తమిళులతో సమన్వయ ప్రక్రియలో ముందుకెళ్లడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. తూర్పు రాష్ట్ర ముఖ్యమంత్రి నజీర్ అహ్మద్‌ను, శ్రీలంక ముస్లిం కాంగ్రెస్ పార్టీ, తమిళ పోగ్రెసివ్ అలయెన్స్, సైక్లోన్ వర్కర్స్ కాంగ్రెస్ పార్టీల నేతలను కూడా ఆమె కలిశారు.

1.25 లక్షల ఉగ్ర ఖాతాలను
సస్పెండ్ చేసిన ట్విట్టర్

వాషింగ్టన్, ఫిబ్రవరి 6: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి పొందిన సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ‘ట్విట్టర్’ గత ఏడాది తొలి ఆరు నెలల్లో ఉగ్రవాదులకు సంబంధించిన 1.25 లక్షలకు పైగా ఖాతాలను సస్పెండ్ చేసింది. వీటిలో అత్యధికం అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)కు చెందినవే ఉన్నాయి. అయితే భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదుల ఖాతాలను ‘ట్విట్టర్’ కనీసం ముట్టుకోనైనా ముట్టుకోలేదు. ఉగ్రవాద స్వరూపం మారడంతో దీనిపై తాము దృష్టి సారించి 2015 మధ్య నాటికే ఉగ్రవాదులకు సంబంధించిన 1.25 లక్షలకు పైగా ఖాతాలను సస్పెండ్ చేశామని, వీటిలో ఐసిస్, దాని అనుబంధ గ్రూపులకు సంబంధించిన ఖాతాలే ఎక్కువగా ఉన్నాయని ‘ట్విట్టర్’ ఒక బ్లాగులో పేర్కొంది. అయితే పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ నుంచి భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదుల ఖాతాల గురించి అడిగిన ప్రశ్నలకు ‘ట్విట్టర్’ సమాధానమివ్వలేదు. ప్రత్యేకించి ముంబయిలో 26/11 దాడులకు సూత్రధారిగా వ్యవహరించిన ఉగ్రవాది హఫీజ్ మహమ్మద్ సరుూద్ ఖాతా గురించి ‘ట్విట్టర్’ ప్రతిస్పందించలేదు.
భారత్‌పై మరిన్ని భీకర దాడులు నిర్వహించాలని హఫీజ్ సరుూద్ తాజాగా ఈ నెల 3వ తేదీన చేసిన ట్వీట్‌లో ఉగ్రమూకలకు బాహాటంగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు తమ మాధ్యమాన్ని ఉపయోగించుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ‘ట్విట్టర్’ పేర్కొంది.