అంతర్జాతీయం

బారక్-8 క్షిపణి పరీక్ష సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలెం, నవంబర్ 27: భారత్‌తో కలిసి నిర్మించిన అధునాతన క్షిపణి బారక్-8ను ఇజ్రాయెల్ సైన్యం విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి గగనతలంలో గల లక్ష్యాన్ని ఛేదించే ఈ క్షిపణిని ఇజ్రాయెల్ నావికాదళానికి చెందిన ఒక నౌకపైనుంచి ప్రయోగించారు. ఇజ్రాయెల్ ఈ తరహా పరీక్ష నిర్వహించడం ఇదే మొదటిసారి. గురువారం నిర్వహించిన ఈ పరీక్షలో బారక్-8 క్షిపణి శత్రువు లక్ష్యాన్ని నూటికి నూరు పాళ్లు అడ్డుకుందని ఇజ్రాయెల్ సైనిక వర్గాలు పిటిఐ వార్తాసంస్థకు చెప్పాయి. నౌకపై నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి ఒక చిన్న ద్రోన్‌ను విజయవంతంగా అడ్డుకుంది.