అంతర్జాతీయం

రియాక్టర్ల నిర్మాణానికి మార్గం సుగమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 6: అణు ప్రమాదాలకు సంబంధించిన అనుబంధ నష్టపరిహారాల ఒడంబడికపై సంతకం చేయడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను అమెరికా స్వాగతిస్తూ, ఈ ముఖ్యమైన చర్య వల్ల భారత్‌లో అణు రియాక్టర్ల నిర్మాణంలో అమెరికా కంపెనీలు పాలుపంచుకోవడానికి వీలవుతుందని పేర్కొంది. ‘సిఎస్‌ఇగా పిలవబడే అణు ప్రమాదాలకు సంబంధించిన అనుబంధ నష్టపరిహార ఒడంబడికలో చేరడానికి భారత్ తీసుకున్న చర్యను అమెరికా స్వాగతిస్తోంది’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. సిఎస్‌ఇలో భారత్‌కు సభ్యత్వం లభించడం అంటే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఇఏ) అణు భద్రత కార్యాచరణ ప్రణాళికగా పేర్కొన్న అంతర్జాతీయ అణు జవాబుదారీ విధానాన్ని రూపొందించే దిశగా ఓ ముందడుగవుతుందని కూడా ఆయన అన్నారు. భారత్‌లో అణు రియాక్టర్ల నిర్మాణంలో అమెరికా కంపెనీలు పాలు పంచుకోవడానికి కూడా దీనివల్ల వీలవుతుందని, అంటే భారతీయులకు మరింత విశ్వసనీయమైన విద్యుత్ లభించడమే కాకుండా ఆ దేశం కర్బన ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేసే వనరుల (బొగ్గు)పై ఆధారపడ్డం తగ్గుతుందని, దానివల్ల పర్యావరణానికి సైతం మేలు జరుగుతుందని తెలిపారు. భారత్‌కు మరింత ఎక్కువ ఇంధన భద్రత లభించడమే కాక దేశ ఆర్థిక వ్యవస్థ పెరగడానికి కూడా వీలవుతుందని కూడా ఆయన అన్నారు.
భారత్-అమెరికా పౌర అణు ఒప్పందం అమలుకు ఈ చర్య దోహదపడుతుందా అని అడగ్గా, అంతర్జాతీయ అణు జవాబుదారీ విధానాన్ని రూపొందించే దిశగా ఇది ఓ ముఖ్యమైన ముందడుగని, భారత్‌లో అణు విద్యుత్ వినియోగాన్ని విస్తరించడంలో అంతర్జాతీయ సహకారానికి దోహదపడుతుందని తాము నమ్ముతున్నామని కిర్బీ చెప్పారు. ఇదిలా ఉండగా భారత్ చర్య ఓ మైలురాయి అని భారత్-అమెరికా అణు ఒప్పందానికి సంబంధించిన వివిధ అంశాల్లో చురుగ్గా పాల్గొన్న అమెరికాలోని భారతీయ నిపుణుడు విజయ్ సజ్వాల్ అన్నారు. భారత్ గురువారంనాడు సిఎస్‌సిపై సంతకం చేసింది. దీనితో పౌర అణు జవాబుదారీకి సంబంధించిన సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం లభించినట్లయింది.