అంతర్జాతీయం

మరో వివాదానికి తెరతీసిన ఉత్తర కొరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, ఫిబ్రవరి 7: నెల రోజుల క్రితం అణ్వస్త్ర పరీక్ష జరిపి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన ఉత్తర కొరియా ఆదివారం ఒక ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ప్రకటించి ఉద్రిక్తతను మరింత పెంచింది. అమెరికా మెయిన్‌లాండ్‌పై దాడి చేయడానికి ఒక ఆయుధాల డెలివరీ సిస్టమ్‌ను సిద్ధం చేయడానికి జరిపిన బాలిస్టిక్ క్షిపణి పరీక్షగా భావిస్తున్న ఈ రాకెట్ ప్రయోగాన్ని అమెరికా, దక్షిణ కొరియా సహా ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. పలు ఐక్యరాజ్య సమితి తీర్మానాలను ఉల్లంఘించేదిగా ఉన్న ఈ రాకెట్ ప్రయోగం ద్వారా నెల రోజుల క్రితం జరిపిన అణ్వస్త్ర పరీక్షపై ఉత్తర కొరియాను శిక్షించడానికి సతమతమవుతున్న ప్రపంచ దేశాల అయోమయాన్ని అది రెట్టింపు చేసినట్లయింది.
రాకెట్ రోదసిలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోందని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు అంటున్నప్పటికీ ఉపగ్రహాన్ని మోసుకు వెళ్లిన రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించిందా లేదా అనే విషయం ధ్రువీకరణ కాలేదు. అయితే రాకెట్ రెండో దశ విఫలమైనట్లు కనిపిస్తోందని అంతకుముందు దక్షిణ కొరియాకు చెందిన ‘యోన్‌హాప్’ వార్తాసంస్థ అనధికారిక కథనాలనుటంకిస్తూ పేర్కొంది.
కాగా, ఉత్తర కొరియా ప్రభుత్వ టీవీలో చేసిన ఒక ప్రత్యేక ప్రకటనలో ఒక మహిళా అనౌన్సర్ ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్ ఈ రాకెట్ ప్రయోగానికి వ్యక్తిగతంగా ఆదేశించారని ప్రకటించింది. ‘క్వాంగ్‌మ్యోంగ్-4’ ఉపగ్రహాన్ని రాకెట్ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిందని కూడా ఆ అనౌన్సర్ ప్రకటించింది. శాంతియుత, స్వతంత్ర ప్రయోజనాలకోసం రోదసిని ఉపయోగించుకోవడానికి ఉత్తర కొరియాకు ఉన్న హక్కు కింద ఈ రాకెట్ ప్రయోగం జరిపినట్లు స్పష్టం చేసిన ఆ అనౌన్సర్ తమ జాతీయ రక్షణ సామర్థ్యాన్ని పెంచడంలో ఈ ప్రయోగం ఓ గొప్ప ముందడుగని కూడా ఆమె పేర్కొంది. భవిష్యత్తులో మరిన్ని ఉపగ్రహ ప్రయోగాల దిశగా ఉత్తర కొరియా శాస్తజ్ఞ్రులు కృషి చేస్తారని కూడా ఆమె తెలిపింది.
ఉత్తర కొరియా ఆదివారం జరిపిన రాకెట్ ప్రయోగంపై ప్రపంచ దేశాలన్నీ తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. అమెరికా ఈ ప్రయోగాన్ని ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచే రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించగా, ఏమాత్రం సహించరాని చర్యగా జపాన్ ప్రధాని షింజో అబే మండిపడ్డారు. ఉత్తర కొరియా జరిపిన లాంగ్ రేంజ్ రాకెట్ ప్రయోగంపై చర్చించడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆదివారం అత్యవసరంగా సమావేశమవుతున్నట్లు న్యూయార్క్‌లో దౌత్యవర్గాలు తెలిపాయి. కాగా, ప్రపంచ శాంతి, సుస్థిరతకు తీవ్రమైన ముప్పుగా పరిణమించిన ఉత్తర కొరియాపై భద్రతా మండలి తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గ్యున్-హే అన్నారు.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు భూ పరిశీలక ఉపగ్రహాన్ని మోసుకుని రాకెట్ నింగిలోకి దూసుకెళ్లినట్లు రాకెట్ ప్రయోగ స్థలంపై నిఘా పెట్టిన దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాన్ని నిషేధిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఒకటికన్నా ఎక్కువ తీర్మానాలే చేసింది. తమ రాకెట్ అభివృద్ధి కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనని ఉత్తర కొరియా చెబుతున్నప్పటికీ దాని రాకెట్లు అటు సివిల్, ఇటు మిలిటరీ అవసరాలు రెండిటికీ ఉపయోగించుకునే టెక్నాలజీని కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు. గత జనవరి 6న ఉత్తర కొరియా జరిపిన అణ్వస్త్ర పరీక్షపై సంఘటితంగా చర్య తీసుకోవడానికి జంకుతున్న ప్రపంచ దేశాలు ఇప్పుడు ఈ తాజా ప్రయోగంపై ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

ఉత్తర కొరియా ఆదివారం ప్రయోగించిన రాకెట్‌ను తిలకిస్తున్న ఆ దేశాధినేత కిమ్-జోంగ్-ఉన్

ప్రజాసేవకే సాంకేతిక పరిజ్ఞానం

దుష్ప్రభావం చూపని ఆవిష్కరణలు అవసరం శాస్తవ్రేత్తలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

భువనేశ్వర్, ఫిబ్రవరి 7: పర్యావరణానికి హాని కలిగించని సాంకేతిక పరిజ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలని, ఈ ఆవిష్కరణలు ఎటువంటి దుష్ప్రభావం చూపనివిగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శాస్తవ్రేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఒడిశా రాజధాని భువనే్వర్ సమీపంలోని జత్ని వద్ద ఆదివారం ఆయన ఎన్‌ఐఎస్‌ఇఆర్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ, పరిశోధనలు చేస్తున్న వారంతా నోబెల్ పురస్కారాన్ని పొందకపోచ్చని, అయితే సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేయడమే వారికి నిజమైన పురస్కారమని స్పష్టం చేశారు. దేశ సాంప్రదాయ విజ్ఞానం గురించి మోదీ మాట్లాడుతూ, గ్రంథాల నుంచి విజ్ఞానాన్ని ఆర్జించిన డాక్టర్ మంజుల్ భార్గవ ఎంతో గొప్ప గణితవేత్తల్లో ఒకరిగా ఆవిర్భవించారని, ఆయన తండ్రి సంస్కృత పండితుడని కొనియాడారు. మన సాంప్రదాయ విజ్ఞానాన్ని శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ‘ప్రజలపై, పర్యావరణంపై ఎటువంటి దుష్ప్రభావం చూపని శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే మన ప్రాధాన్యత కావాలి’ అని మోదీ స్పష్టం చేశారు. ఒడిశాలో బొగ్గు గనులు తరిగిపోయాయని, కనుక చౌకగా అందుబాటులోకి వచ్చే హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని (గ్రీన్ టెక్నాలజీని) అభివృద్ధి చేయడం ద్వారా మళ్లీ బొగ్గు నిల్వలు అభివృద్ధి చెందేందుకు వీలు కల్పించాలని ఆయన అన్నారు. అంతరిక్షం, సాగరాల నుంచి మనం ఇప్పటికీ సరైన ప్రయోజనాలను పొందలేదని, అక్కడ వనరులను అనే్వషించి వాటిని ప్రజల సంక్షేమానికి ఉపయోగించాలన్నారు. సంపద ఉండబట్టే సముద్రాన్ని మన పూర్వీకులు ‘రత్నగర్భ’గా అభివర్ణించారని, కనుక సాగరాల్లో పరిశోధనలు సాగించాలని ఆయన శాస్తవ్రేత్తలకు పిలుపునిచ్చారు. అంగారక గ్రహ యాత్ర (మార్స్ మిషన్) ద్వారా ఖగోళ పరిశోధనల్లో భారత్ ఇప్పటికే తన ఉనికిని చాటుకుందన్నారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంపై మన శాస్తవ్రేత్తలు పరిశోధనలు మొదలు పెట్టినప్పుడు వారికి సరైన తోడ్పాటు లేదని, అయినప్పటికీ వారు ఎన్నో విజయాలు సాధించారని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంధన పొదుపు ఆవశ్యకత గురించి ప్రధాని ఈ సందర్భంగా ఉద్ఘాటిస్తూ, చౌకగా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయడాన్ని శాస్తవ్రేత్తలు సవాలుగా స్వీకరించాలని, పేద ప్రజలకు సైతం ఉపయోగపడేలా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ ఎస్‌సి.జమీర్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రులు జువల్ ఓరమ్, ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు.

చిత్రం... ఒడిశా పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి భువనేశ్వర్ విమానాశ్రయంలో
స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్