అంతర్జాతీయం

మసూద్ పాత్రపై ఆధారాలు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 8: ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో పాకిస్తాన్ రెండు నాల్కల ధోరణి మరోసారి బయటపడింది. పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక స్థావరంపై ఇటీవల జరిగిన దాడిలో జైష్ ఎ మహమ్మద్ (జెఇఎం) అధినేత వౌలానా మసూద్ అజర్ పాత్ర ఉన్నట్లు నిరూపించే ఎలాంటి ఆధారాలు దొరకలేదని పాకిస్తాన్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేర్కొన్నట్లు మీడియా కథనాలు తెలిపాయి. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి సూత్రధారి నిషిద్ధ ఉగ్రవాద సంస్థ జెఇఎం అధినేత వౌలానా మసూద్ అజర్ అని భారత్ చేస్తున్న వాదనను పాకిస్తాన్ అధికారులు ఏర్పాటు చేసిన సిట్ తోసిపుచ్చినట్లు మీడియా వార్తలు వెల్లడించాయి. ఆరుగురు సాయుధ ఉగ్రవాదులు జనవరి 2న పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. వీరిని మట్టుపెట్టేందుకు మూడు రోజుల పాటు సాగిన ఆపరేషన్‌లో ఏడుగురు సైనికులు వీరమరణం పొందారు. ఈ దాడితో పాకిస్తాన్‌లోని వారికి సంబంధం ఉన్నట్లు వెల్లడించే ఆధారాలను భారత్ ఆ దేశానికి అందజేసింది. దీంతో ఉన్నత స్థాయి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించారు. ఆ తరువాత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో జెఇఎంకు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నారు. జెఇఎం కార్యాలయాలపై దాడులు చేసి, పదుల సంఖ్యలో కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అయితే జెఇఎం అధినేత మసూద్‌కు ఈ దాడితో సంబంధం ఉన్నట్లు ఆధారాలు లభ్యం కాలేదని సిట్ తాజాగా పేర్కొనడం విశేషం.