అంతర్జాతీయం

రోదసీలో మరోఐదు ‘జూపిటర్లు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహంగా భావిస్తున్న జూపిటర్ తరహాలో మరో ఐదు కొత్త గ్రహాలను శాస్తవ్రేత్తలు కనిపెట్టారు. వీటన్నింటికీ కూడా అనేక విధాలుగా జూపిటర్ గ్రహంతో సారూప్యత ఉందని కీలీ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఈ ఐదు కొత్త గ్రహాలు కూడా తమ మాతృ నక్షత్రాలు అతి సమీపంగా పరిభ్రమించడం వల్ల జూపిటర్ (బృహస్పతి) తరహాలో ఇవన్నీకూడా అగ్ని గుండాలుగానే ఉన్నాయని వెల్లడించారు. సుదూర గ్రహాలను కనిపెట్టేందుకు రూపొందించిన ఎనిమిది కెమేరాల వ్యాస్ప్ పరికరంతో ఈ ఐదు గ్రహాలను తాము గుర్తించినట్టుగా పరిశోధనకులు తెలిపారు. ముఖ్యంగా గగనతలం దక్షిణ భాగంలో ఉండే గ్రహాలు, నక్షత్రాలపైనే తమ దృష్టిని కేంద్రీకరించినట్టు తెలిపారు. వీటికి వ్యాస్ప్ 119బి, 124బి, 126బి, 129బి, 133బిగా నామకరణం చేసి వాటి గమనాన్ని తీరుతెన్నులను అనేక కోణాల్లో విశే్లషిస్తున్నారు. ఈ గ్రహాలు తమ మాతృ నక్షత్రాలు చుట్టూ పరిభ్రమించే కాలంలో ఎంతో తేడా ఉందని, ఈ పరిభ్రమణ వ్యవధి 2.17 రోజుల నుంచి 5.75 రోజుల మధ్య ఉందని స్పష్టం చేశారు. అలాగే వీటి ద్రవ్యరాశి కూడా సౌర వ్యవస్థలోని జూపిటర్‌తో పోలిస్తే 0.3 నుంచి 1.2 మధ్య ఉందని వెల్లడించారు.