అంతర్జాతీయం

దుండగుడి కాల్పుల్లో ఏడుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలామజూ, ఫిబ్రవరి 21: అమెరికాలోని పశ్చిమ మిచిగాన్ నగరంలో ఓ ఆగంతకుడు విచ్చలివిడిగా కాల్పులు జరిపి ఏడుగురిని చంపేశాడు. మృతుల్లో 14ఏళ్ల బాలిక ఉందని అధికారులు తెలిపారు. ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని రెస్టారెంట్ వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 45 ఏళ్ల అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.కార్కర్ బర్రెల్ వద్ద దుండగుని కాల్పుల్లో 14 బాలికతోపాటు ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని కలామజూ కౌంటీ పోలీసు అధికారి పౌల్ మెట్యాస్ వెల్లడించారు. రెస్టారెంట్ పక్కనే ఉన్న కార్‌డీలర్ షిప్ యజమాని, ఆయన కుమారుడూ కాల్పుల్లో చనిపోయారని అన్నారు. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ చెందిన మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన చెప్పారు. తొలత కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందినట్టు వచ్చిన అధికార ప్రటనను పౌల్ సవరించారు. చనిపోయింది ఏడుగురేనని ఆయన స్పష్టం చేశారు. ఓ టివి చానల్‌లో మాట్లాడిన ఆయన పోలీసు అధికారుల పట్టుకోవడానికి వెళ్లినప్పుడు అనుమానితుడి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదన్నారు. అతడి వాహనంలోంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు పౌల్ పేర్కొన్నారు. పశ్చిమ డెట్రాయిట్‌కు 258 కి.మి దూరంలో కలామజూ నగరం ఉంది.