అంతర్జాతీయం

ఉద్యోగాలను వెనక్కి తెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష పదవికి తీవ్రస్థాయిలో పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (69) భారత్‌తోపాటు చైనాపై మరోసారి అక్కసు వెళ్లగక్కాడు. అమెరికానుంచి భారత్, చైనా వంటి దేశాలు ఉద్యోగాలను తన్నుకుపోతున్నాయని ఆయన ఆరోపిస్తూ, వాటిని అమెరికాకు తిరిగి తీసుకొస్తానని శపథం చేశాడు. అమెరికాలోని ఆఫ్రికా సంతతి ప్రజల (ఆఫ్రో-అమెరికన్స్) నుంచి తనకు విశేష మద్దతు లభిస్తుందని జోస్యం చెబుతూ ట్రంప్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘అమెరికా నుంచి భారత్, చైనా, మెక్సికో, జపాన్, వియత్నాం తదితర దేశాలు ఉద్యోగాలను ఎత్తుకెళ్లిపోతున్నాయి. వాటిని తిరిగి అమెరికాకు తీసుకురావాలని నేను యోచిస్తున్నా. అందుకే ఆఫ్రో-అమెరికన్లు నన్ను నిజంగా ఇష్టపడుతున్నారని వారి నాయకులు స్పష్టం చేస్తున్నారు’ అని ఆయన అన్నాడు. దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం ట్రంప్ ఆదివారం ‘సిఎన్‌ఎన్’ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
అమెరికాలోని ఆఫ్రికా సంతతి ప్రజలు అన్ని రంగాల్లో శే్వత జాతీయుల కంటే ఎంతో వెనుకబడ్డారని, వారిలో 58 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని, ఇది తీవ్ర విచారకరమని ట్రంప్ పేర్కొంటూ, ఆఫ్రో-అమెరికన్లను అన్ని విధాలుగా పైకి తీసుకొచ్చి వారి గౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎంతో దిట్టగా పేరుపొందిన ట్రంప్ ఒకవైపు తన ప్రసంగాల్లో చైనా, మెక్సికో, జపాన్ వంటి దేశాలను బాహాటంగా విమర్శిస్తూనే మరోవైపు భారత్ ఎంతో గొప్పగా పనిచేస్తోందని, అయినా దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్న విషయం విదితమే.

అట్లాంటాలో ప్రచారం చేస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్