జాతీయ వార్తలు

ఇంటరాగేషన్‌లో ఖలీద్, భట్టాచార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జెఎన్‌యు వివాదానికి సంబంధించి మంగళవారం రాత్రి ఢిల్లీ పోలీసుల వద్ద లొంగిపోయిన విద్యార్థులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యను ఐదుగంటలపాటు విచారించారు. బుధవారం వేకువ జామున ఇరువురు విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు వారిద్దరినీ ప్రశ్నించారు. కనీసం ఐదు గంటలపాటు విద్యార్థులను ఇంటరాగేషన్ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అరెస్టు తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విద్యార్థులు ఎక్కడ ఆశ్రయం పొందిందీ పోలీసులు ఆరా తీశారు. ఫిబ్రవరి 9న జెఎన్‌యులో అఫ్జల్‌గురు సంస్మరణ కార్యక్రమాన్ని ఖలీద్, భట్టాచార్యలే నిర్వహించినట్టు, అలాగే జాతి వ్యతిరేక నినాదాలు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా జెఎన్‌యు విదాదంలో మరో ముగ్గురు విద్యార్థుల కోసం గాలిస్తున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 12నుంచి అదృశ్యమైన ఖలీద్, భట్టాచార్యలు ఆదివారం రాత్రి జెఎన్‌యు క్యాంపస్‌లోనే ప్రత్యక్షమయ్యారు. గత రాత్రి వారిరువురూ ఢిల్లీ పోలీసులకు లొంగిపోయారు.

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయన ఖలీద్, భట్టాచార్య