అంతర్జాతీయం

ఎన్ని కష్టాలు ఎదురైనా ఐసిస్‌ను అంతం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: సిరియాలో నరమేథం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులపై పోరాటాన్ని సాగించడం ‘కష్టతరం’గా ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంగీకరించారు. అయినప్పటికీ అత్యంత కరడుగట్టిన ఆ ఉగ్రవాద సంస్థను నాశనం చేసి తీరుతామని, ఇందుకోసం సిరియాలో కొనసాగుతున్న సంఘర్షణకు తెరదించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. ‘ఐసిస్ ఉగ్రవాదులపై పోరాటాన్ని సాగించడం కష్టతరంగా ఉంది. అయినప్పటికీ వారిని తుదముట్టించేందుకు మా శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తాం. ఈ పోరాటంలో విజయం సాధించి సురక్షితమైన భవిష్యత్తుకు బాటలు వేయగలమని నేను గట్టిగా విశ్వసిస్తున్నా’ అని ఒబామా తన వారాంతపు ప్రసంగంలో పేర్కొన్నారు. సిరియాతో పాటు ఇరాక్‌లో ప్రస్తుతం పరిస్థితి సంక్లిష్టంగా ఉందని, అందుకే ఐసిస్ ఉగ్రవాదులపై పోరాడటం కష్టతరంగా ఉందని అన్నారు. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ గ్రూపును ఓడించేందుకు అమెరికా కమెండోలు సిరియా ప్రజాతంత్ర దళాలుగా పిలిచే కుర్దు యోధులతోపాటు ఐసిస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇతర గ్రూపులతో కలసి పనిచేస్తున్నారని తెలిపారు. సిరియాలో ఎంతో బలంగా వేళ్లూనుకున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ అమాయక ప్రజలను రక్షణ కవచాలుగా ఉపయోగించుకుంటోందని, ఈ సవాళ్లు ఉన్నప్పటికీ అక్కడ ఉగ్రమూకలపై పోరాడటంలో అమెరికా బలగాలు పురోగతి సాధిస్తున్నాయని కచ్చితంగా చెప్పగలనని ఒబామా అన్నారు. అంతేకాకుండా ఐసిస్ ఉగ్రవాదులపై అన్ని వైపుల నుంచి దాడులను ముమ్మరం చేయాల్సిందిగా ఈ వారం తమ బృందాన్ని ఆదేశించినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా నేతృత్వంలో పోరాడుతున్న 66 దేశాల సంకీర్ణ కూటమి క్రమేణా బలపడుతోందని, ఈ పోరాటానికి మరిన్ని దేశాలు చేయూతనిస్తున్నాయని ఒబామా చెప్పారు.