అంతర్జాతీయం

‘మ్యాడ్ మ్యాక్స్..’కు అవార్డుల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తమనటుడు డికాప్రియో ఉత్తమనటి బ్రీ లార్సన్ ఉత్తమ చిత్రం స్పాట్‌లైట్ అట్టహాసంగా ఆస్కార్ పురస్కారాల ప్రదానం

ఆస్కార్ విజేతలు
ఉత్తమ నటుడు: లియోనార్డో డికాప్రియో ( ది రెవెనంట్)
ఉత్తమ నటి : బ్రీ లార్సన్ (రూమ్)
ఉత్తమ సహాయ నటుడు : మార్క్ రైలాన్స్ (బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్)
ఉత్తమ సహాయ నటి : అలీసియా వికాండర్ (ది డానిష్ గర్ల్)
ఉత్తమ దర్శకుడు : ఇన్‌రిటో (ది రెనెనంట్)
ఉత్తమ ఛాయాగ్రహణం : ఎమాన్యుయల్ లుబెజ్కి ( ది రెవెనంట్)
ఉత్తమ యానిమేషన్ చిత్రం : ఇన్‌సైడ్ అవుట్
ఉత్తమ సంగీతం : మెర్రీకోన్ (ది హేట్‌ఫుల్ ఎయిట్)
ఉత్తమ ఒరిజనల్ స్ట్రీన్ ప్లే: స్పాట్‌లైట్
ఉత్తమ పాట : రైటింగ్స్ ఆన్ ది వాల్ (స్పెక్టర్)
ఉత్తమ కాస్ట్యూమ్స్ : జెన్నీ బెవన్ ( మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : కొలిన్ గిబ్బన్, థాంప్సన్ (మ్యాడ్ మ్యాక్స్..)
ఉత్తమ అలంకరణ, కేశాలంకరణ : వాండర్‌వాల్క్, ఎల్కా వార్డెగా, మార్టిన్ (మ్యాడ్ మ్యాక్స్..)
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, ఫిల్మ్ ఎడిటింగ్ : మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్
ఉత్తమ విదేశీ చిత్రం : ఆన్ ఆఫ్ సాల్ (హంగరీ)

లాస్ ఏంజిలిస్: ‘టైటానిక్’ హీరో లియోనార్డో డికాప్రియో (41) చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరింది. గతంలో నాలుగుసార్లు ‘ఆస్కార్’కు నామినేట్ అయిన లియో చివరకు ఆ అవార్డును సొంతం చేసుకున్నాడు. ‘ది రెవెనంట్’ చిత్రంలో నటనకుగాను ఆయనను ఈ ఏడాది ఆస్కార్ పురస్కారం వరించింది. లాస్ ఏంజిలిస్‌లోని డాల్బీ థియేటర్‌లో అత్యంత కోలాహలంగా జరిగిన 88వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవంలో తొలిసారిగా అవార్డు అందుకున్న లియోనార్డో ఒకింత భావోద్వేగానికి లోనై తన అంతరంగాన్ని ఆహూతుల ముందు ఆవిష్కరించాడు. తాను అవార్డును అందుకుంటున్న క్షణంలో డాల్బీ థియేటర్ కరతాళ ధ్వనులతో మార్మోగుతుండగా- లియో ‘ది రెవెనెంట్’ గురించి ప్రస్తావిస్తూ, సహిజ సిద్ధమైన ప్రకృతితో ఈ సినిమాకు ఎంతో సంబంధం ఉందన్నాడు. ఈ సృష్టిలో వాతావరణ మార్పులు అత్యంత వాస్తవమైనవని, అదే ఇపుడు జరుగుతోందని, ఈ సమస్యల్ని అధిగమించేందుకు ఎలాంటి జాప్యం లేకుండా ప్రపంచ ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చాడు. 19 ఏళ్ల వయసులో తాను తొలిసారిగా 1994లో ఆస్కార్‌కు నామినేట్ అయ్యానని, ఇప్పటికి నాలుగుసార్లు చేజారిన అవార్డు ఇన్నాళ్లకు తనకు దక్కిందని లియో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
1994లో ‘వాట్ ఈజ్ ఈటింగ్ గిల్బెర్ట్ గ్రేప్’, 2004లో ‘ది ఏవియేటర్’, 2006లో ‘బ్లడ్ డైమండ్’, 2013లో ‘వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’ సినిమాలకు నామినేట్ అయినప్పటికీ, నేడు ‘ది రెవెనంట్’తో లియోకు ‘ఆస్కార్’ దాహం తీరింది.
మిన్నంటిన సంబరం..
హాలీవుడ్ నటుడు క్రిస్‌రాక్ ప్రయోక్తగా వ్యవహరించగా ఆస్కార్ పురస్కారాల వేదిక అంతులేని సంబరాలకు సాక్షిగా నిలిచింది. అవార్డు గ్రహీతలు, బహుమతులను ప్రదానం చేసే ప్రముఖులు, హాలీవుడ్ తారాగణంతో సందడి కొనసాగింది. మేటి హాస్యనటుడిగా ప్రసిద్ధి చెందిన క్రిస్‌రాక్ తన ఛలోక్తులతో, చతురతతో ఆహూతులను ఆద్యంతం అలరించారు. ‘టైటానిక్’తో యావత్ ప్రపంచాన్ని అలరించిన ఆ చిత్రం హీరో,హీరోయిన్లు డికాప్రియో, కేట్ విన్స్‌లెట్ చాలా కాలం తర్వాత ఒక్కసారి ఆస్కార్ వేదికపై తళుక్కుమన్నారు. మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తెలుపురంగు గౌనుతో హాజరై ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగంలో విజేత అయిన మార్గరెట్ సిజెల్‌కు పురస్కారాన్ని అందజేసింది. విజేతలకు బహుమతులను అందజేసే సెలబ్రిటీగా భారత్ తరఫున ఏకైక ప్రతినిధిగా ప్రియాంక హాజరైంది.
టాప్ విన్నర్‌గా ‘మ్యాడ్ మ్యాక్స్..’
మొత్తం పది విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్’ ఆరు అంశాల్లో అవార్డులను కైవసం చేసుకుని ‘టాప్ విన్నర్’గా నిలిచింది. ‘ది రెవెనెంట్’కు మూడు, ‘స్పాట్‌లైట్’కు రెండు పురస్కారాలు లభించాయి. ఉత్తమ చిత్రం కేటగిరీలో ‘స్పాట్‌లైట్’కు అవార్డు దక్కింది. కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ డిజైన్, మేకప్ (హెయిర్ స్టయిల్స్), ఫిల్మ్ ఎడిటింగ్, సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ విభాగాల్లో ఆరు అవార్డులను సాధించిన ‘మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్’ ఈ ఏడాది అవార్డుల వేదికపై ఆధిక్యతను చాటుకుంది. ఈ సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేసిన జెన్నీ బీవాన్‌కు ఆస్కార్ లభించడం ఇది రెండోసారి. ‘మ్యాడ్ మ్యాక్స్...’కు ప్రొడక్షన్ డిజైనర్లుగా పనిచేసిన కొలిన్ గిబ్బన్, లీసా థాంప్సన్, ఇదే సినిమాకు ఫిల్మ్ ఎడిటర్‌గా వ్యవహరించిన మార్గరెట్ సిజెల్, సౌండ్ ఎడిటింగ్‌లో మార్క్ మాంగిని, డేవిడ్ వైట్, సౌండ్ మిక్సింగ్‌లో క్రిస్ జెన్‌కిన్స్, గ్రైగ్ రుడాల్ఫ్, బెన్ ఓస్మోలకు అవార్డులు దక్కాయి.
ఉత్తమనటి బ్రీ లార్సన్
‘రూమ్’ చిత్రంలో అత్యద్భుతంగా నటించినందుకు ఉత్తమ నటిగా బ్రీ లార్సన్ అవార్డును తన ఖాతాలో వేసుకుంది. ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి ప్రయత్నంలోనే అవార్డు దక్కడం విశేషం.
‘కళాకారిణి’.. ఉత్తమ సహాయనటి
‘ది డేనిష్ గర్ల్’లో కళాకారిణి పాత్రలో నైపుణ్యం ప్రదర్శించిన అలిసియా వికాండర్ ఉత్తమ సహాయ నటి అవార్డును సాధించింది.
ఉత్తమ సహాయ నటుడు రైలాన్స్
స్టీఫెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో ‘బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్’లో కీలక పాత్రలో నటించిన మార్క్ రైలాన్స్ ఈ ఏడాది ఉత్తమ సహాయ నటుడిగా నిలిచాడు.
ఉత్తమ దర్శకుడు ఇన్‌రిటో
మెక్సికోకు చెందిన అల్‌జాండ్రో గొంజాలెజ్ ఇన్‌రిటో ఈ ఏడాది ‘ది రెవెనంట్’ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఆయన ఆస్కార్‌ను దక్కించుకోవడం ఇది రెండోసారి. గత ఏడాది ‘బర్డ్‌మ్యాన్’కు కూడా ఆయన అవార్డును అందుకున్నారు.
జర్నలిజం నేపథ్యంలో..
జర్నలిస్టుల బృందం చేసిన సాహసాలను కథాంశంగా తీసుకుని రూపొందించిన ‘స్పాట్‌లైట్’ ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు ఆస్కార్ పురస్కారం ఖాయమంటూ సినీ విమర్శకులు వేసిన అంచనాలు నిజమయ్యాయి. లైంగిక వేధింపులకు బరితెగించిన ఓ చర్చి పూజారి అకృత్యాలను ఓ జర్నలిస్టుల బృందం బహిర్గతం చేయడమే ‘స్పాట్‌లైట్’ ఇతివృత్తం. పరిశోధనాత్మక జర్నలిజం ఎలా కొత్తపుంతలు తొక్కుతోందో ఈ సినిమాలో దర్శకుడు టామ్ మెక్‌కర్తీ అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ చిత్రం నిర్మాతలు మైఖేల్ షుగర్, స్టీవ్ గొలిన్, నికోల్ రాక్లిన్, బై పాగన్ అవార్డును అందుకున్నారు.
ఆరో ప్రయత్నంలో దక్కింది..
87 ఏళ్ల వయసులో ‘ది హేట్‌ఫుల్ ఎయిట్’కు స్వరాలు అందించిన ఎన్నియో మెర్రీకోన్ తన ఆరో ప్రయత్నంలో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును కైవసం చేసుకున్నారు. గతంలో ఆయన అయిదుసార్లు ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు.
‘హ్యాట్రిక్’వీరుడు ఎమాన్యువల్
సినిమాటోగ్రఫీ విభాగంలో ‘ది రెవెనెంట్’కు కెమెరామెన్‌గా పనిచేసిన ఎమాన్యువల్ లుబెజ్కి వరుసగా మూడోసారి ఆస్కార్ సాధించి ‘హ్యాట్రిక్’ రికార్డును సృష్టించారు. గతంలో వరుసగా ‘గావిటీ’, ‘బర్డ్‌మాన్’ సినిమాలకు ఆయన సినిమాటోగ్రఫీలో పురస్కారాలు అందుకున్నారు.