అంతర్జాతీయం

మరో వివాదంలో చిక్కుకున్న ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థికోసం జరుగుతున్న ప్రచారంలో అందరికన్నా ముందు వరసలో ఉన్న డొనాల్ట్ ట్రంప్ జాతిపిత మహాత్మాగాంధీ చేసినవిగా చెబుతూ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి తెరదీశాయి.
అయితే అమెరికా మీడియా మాత్రం అది మహాత్మాగాంధీ చేసిన వ్యాఖ్యలు కాదని, ఆయన అనని మాటలను ఆయనవిగా ట్రంప్ పేర్కొనడం సరికాదంటూ మండిపడ్డాయి. తన మద్దతుదారులను కూడగట్టడంలో భాగంగా ట్రంప్ సోమవారం సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో మహాత్మాగాంధీ చేసినదిగా పేర్కొంటూ ‘మొదట వాళ్లు నిన్ను పట్టించుకోరు, ఆ తర్వాత నిన్ను చూసి నవ్వుతారు. ఆ తర్వాత మీతో పోరాడుతారు. అప్పుడు మీరు విజయం సాధిస్తారు’ అనే కోట్‌ను ఉంచారు. అలబామాలో ప్రచారంలో భాగంగా ట్రంప్ ఆగినచోట వందలాది మంది ఆయన మద్దతుదారులు గుమికూడి ఉన్న ఓ ఫోటోను కూడా దానిలో ఉంచారు. అయితే దీన్ని చూసిన వెంటనే ట్రంప్ వ్యతిరేక లాబీ ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డం ప్రారంభించింది. మహాత్మా గాంధీ చేసినట్లుగా చెబుతున్న ఈ వ్యాఖ్యలు వాస్తవానికి ఆయన చేసినవని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రముఖ అమెరికా రాజకీయ వెబ్‌సైట్ ‘ది హిల్’ వ్యాఖ్యానించింది. అంతేకాదు, 1918లో సోషలిస్టు నాయకుడు నికొలస్ క్లీన్ ఓ కార్మిక సమావేశంలో వాడిన పదాలను పోలినట్లుగా ఇవి ఉన్నాయని కూడా అది పేర్కొంది. కాగా, ‘క్రిస్టియన్ సైన్స్ మానిటర్’ పత్రిక అయితే మరో అడుగు ముందుకేసి దీన్ని టాప్ 10 మిస్‌కోట్‌లలో ఒకటిగా పేర్కొంది. కాగా, ఈ వివాదంపై ట్రంప్ ప్రచార కార్యాలయం వెంటనే ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. గాంధీజీ ఈ మాటలు ఎప్పుడూ చెప్పలేదని స్కాట్లాండ్‌కు చెందిన టి. స్మిత్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో స్పష్టం చేశాడు. ఆదివారం ఉదయం ఇటలీకి చెందిన ఫాసిస్టు నాయకుడు ముస్సోలినీ చేసిన వ్యాఖ్యలను తిరిగి ట్వీట్ చేసినందుకు ట్రంప్‌ను పలువురు తీవ్రంగా విమర్శించడంతో ఆయన గాంధీజీ చేసిన వ్యాఖ్యలను కోట్ చేయడానికి ప్రయత్నించారు.
chitram..
వాల్‌దోస్తా యూనివర్సిటీలో ప్రచారం చేస్తున్న రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్