అంతర్జాతీయం

చైనాను కాదంటే భారత్‌కే నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనాను కాదని అమెరికాతో చేతులు కలిపితే భారత్‌కు కష్టమేనని ఆ దేశ అధికార పత్రిక మంగళవారం వ్యాఖ్యానించింది. ఆర్థిక వృద్ధి ‘బ్రిక్స్’ సదస్సు విజయవంతం కావడానికి భారత్‌కు చైనా సాయం అవసరమని చైనా అధికార దినపత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ వ్యాఖ్యానించింది. ‘్భరత ప్రభుత్వం ఒక వాస్తవ దృక్పథంతో కూడిన దౌత్య విధానాన్ని పాటిస్తోంది. అంతేకాదు, అమెరికా, చైనాల మధ్య సమతౌల్యత సాధించడానికి ప్రయత్నిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో సంయుక్త గస్తీ నిర్వహించడానికి తమతో చేతులు కలపాలన్న అమెరికా విజ్ఞప్తిని భారత్ తిరస్కరించడం గత ఏడాది పాకిస్తాన్‌కు ఆయుధాల విక్రయానికి అమెరికా ఆమోదం తెలపడానికి ప్రతీకారంగా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇది నిజమే కావచ్చు. అయితే తమ దేశానికి చైనాతో పటిష్ఠమైన సంబంధాలు చాలా ముఖ్యమనే విషయాన్ని భారత్ అర్థం చేసుకోవడం దీనికి మూలకారణం. దేశాభివృద్దికి ఆర్థిక చోదకశక్తిగా పనిచేసే చైనా మద్దతును వదులుకోవడానికి భారత్ సిద్ధంగా లేదు’ అని ఆ పత్రిక ఓ వ్యాసంలో వ్యాఖ్యానించింది. ఇదేకాకుండా భారత్ గత నెల ‘బ్రిక్స్’ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా కూటమి) అధ్యక్ష పదవిని రష్యానుంచి అధికారికంగా స్వీకరించడమే కాకుండా మరికొద్ది నెలల్లోనే ఎనిమిదో శిఖరాగ్ర సమావేశం నిర్వహించనుంది. ఆ సదస్సు విజయవంతం కావడానికి ఒక స్నేహపూర్వక వాతావరణం చాలా ముఖ్యం’ అని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. అమెరికా ప్రతిపాదనను తిరస్కరించడం ద్వారా భారత్ చైనాపట్ల స్నేహపూర్వక, సుహృద్భావ వైఖరి తీసుకుందని కూడా ఆ పత్రిక వ్యాఖ్యానించింది. గ్లోబల్ టైమ్స్ పత్రికలో వారం రోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఇది రెండోసారి. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికాతో కలిసి సంయుక్తంగా గస్తీ నిర్వహించడానికి భారత్ నిర్ణయం తీసుకునే పక్షంలో అది దాని జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకం కావడమే కాక, ఆసియా దేశాలు రెండుగా చీలిపోవడానికి దారి తీయడంతో పాటుగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిపోవడానికి కారణమవుతుంది అని గత నెల 26న ఇదే పత్రిక ఓ వ్యాసంలో అభిప్రాయ పడింది. పాకిస్తాన్‌కు ఎఫ్-16 యుద్ద విమానాలను విక్రయించడానికి నిర్ణయం తీసుకోవడం ద్వారా భారత్, పాక్‌ల మధ్య ఘర్షణలను సృష్టించడానికి అమెరికా ప్రయత్నిస్తోందని కూడా ఆ రోజు ఆ పత్రిక వ్యాఖ్యానించింది.