అంతర్జాతీయం

నలుగురు భారతీయ నర్సులు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడెన్: దక్షిణ యెమెన్‌లోని ప్రధాన నగరం ఎడెన్‌లో శుక్రవారం సాయుధ దుండగులు ఒక వృద్ధాశ్రమంపై కాల్పులు జరపడంతో నలుగురు భారతీయ నర్సులతో పాటు కనీసం 16 మంది మృతి చెందారని భద్రతా అధికారులు చెప్పారు. ఎడెన్‌లోని షేక్ ఒత్మన్ ప్రాంతంలో ఉన్న వృద్ధాశ్రమంలోకి నలుగురు సాయుధ దుండగులు చొరబడి మొదట అక్కడున్న గార్డును కాల్చి చంపిన తర్వాత సిబ్బందిని కట్టేసి కాల్చి చంపినట్లు అధికారులు ఎఎఫ్‌పి వార్తాసంస్థకు తెలిపారు. దాడి తర్వాత పెద్ద సంఖ్యలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, దాడి చేసిన వారు ఇటీవలి కాలంలో ఎడెన్‌లో పట్టు సంపాదిస్తున్న ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లని ఒక అధికారి చెప్పారు. చనిపోయిన నలుగురు భారతీయ నర్సులు నన్స్ అని, చనిపోయిన మిగతా వారంతా వృద్ధాశ్రమంలో పని చేస్తున్న యెమన్ దేశస్థులని అధికారులు చెప్పారు. కాగా, దాడికి తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద ముఠా ప్రకటించుకోలేదు.
యెమెన్‌లో ఈ తరహా దాడి జరగడం ఇదే మొదటిసారి. ఓ వైపు ఇరాన్ మద్దతుతో రెచ్చిపోతున్న తిరుగుబాటుదారులు, మరోవైపు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న జిహాదీ ముప్పులను ఎదుర్కోలేక యెమెన్ ప్రభుత్వం సతమతమవుతోంది. దేశ రాజధాని సనా 2014 సెప్టెంబర్‌లో హుతి తిరుగుబాటుదారులు, వారి మద్దతుదారుల హస్తగతం కావడంతో అధ్యక్షుడు అబెద్రాబ్బో మన్సూర్ హది ఎడెన్‌ను తాత్కాలిక రాజధానిగా ప్రకటించారు. కాగా, షబ్వా రాష్ట్రంలో అల్‌ఖైదా మిలిటెంట్లు ప్రయాణిస్తున్న ఒక వాహనంపై డ్రోన్ దాడిలో వాహనంలోని మొత్తం నలుగురు చనిపోయినట్లు స్థానిక ప్రభుత్వ, గిరిజన వర్గాలు శుక్రవారం తెలిపాయి.