అంతర్జాతీయం

ట్రంప్ పనిపడదాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వంకోసం సాగుతున్న రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉద్ధృతంగా ప్రచారం చేయాలని డెమొక్రటిక్ పార్టీ వ్యూహకర్తలు, ఆ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వారిలో ముందున్న హిల్లరీ క్లింటన్ మద్దతుదారులు నిర్ణయించారు. మరోవైపు, వివాదాస్పద బిలియనీర్ అయిన ట్రంప్ సొంత పార్టీ నాయకత్వం నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. 69 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి 22 ఉదారవాద గ్రూపులు ఒక్కటయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాలలో ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించాయి. క్లీవ్‌లాండ్‌లో ఈ వేసవిలో జరిగే రిపబ్లికన్ నేషనల్ కనె్వన్షన్ వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం వల్ల మనం ఎంతగానో ప్రేమించే దేశానికే ముప్పు వాటిల్లుతుందని ఈ గ్రూపులు పేర్కొంటున్నాయి. ట్రంప్ అధ్యక్ష భవనమైన వైట్‌హౌస్ దరిదాపుల్లోకి ఎన్నటికీ చేరుకోకుండా ఉండాలనే లక్ష్యంతో అహింసాయుతంగా ఈ ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించే విధానాలను అమెరికన్లు తోసిపుచ్చారని, ఈ విధానాలు కాలం చెల్లిన రాజకీయ వ్యూహాలని దేశంలోని ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి స్పష్టం చేసే విధంగా తమ ప్రచారం ఉంటుందని ఈ గ్రూపులు ఒక బహిరంగ లేఖలో పేర్కొన్నాయి