అంతర్జాతీయం

పేలుళ్లతో దద్దరిల్లిన బ్రస్సెల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ మంగళవారం ఉదయం వరస బాంబుదాడులతో దద్దరిల్లింది. బ్రస్సెల్స్ విమానాశ్రయంలో జంట బాంబు పేలుళ్ల తర్వాత నగరంలోని ఓ మెట్రో రైల్వే స్టేషన్‌లో మరో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో కనీసం 34 మంది చనిపోగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఐరోపా దేశాలను టార్గెట్‌గా చేసుకుని జరిపిన ఈ తాజా దాడితో ఐరోపా దేశాలన్నిటిలోను భద్రతను కట్టుదిట్టం చేశారు. ‘ఏది జరక్కూడదని భావించామో అదే జరిగింది, ఇది ఓ బ్లాక్ డే’ అని పేలుళ్ల అనంతరం బెల్జియం ప్రధాని చార్లెస్ మిచెల్ జాతీయ టెలివిజన్‌లో మాట్లాడుతూ అన్నారు. ఉదయం 8 గంటలు (్భరత కాలమానం ప్రకారం 11.30 గంటలకు) జవెంటెం విమానాశ్రయం మెయిన్‌హాలును లక్ష్యంగా చేసుకుని రెండు పేలుళ్లు సంభవించాయని, ఈ పేలుళ్లలో కనీసం ఒక మానవ బాంబు ఉండవచ్చని ప్రాసిక్యూటర్ వాన్ లీయు చెప్పారు. ఇది జరిగిన కొద్ది సేపటికే ఐరోపా యూనియన్ ప్రధాన కార్యాలయాలకు సమీపంలోని మాల్‌బీక్ మెట్రో స్టేషన్‌లో మరో బాంబు పేలింది. రద్దీ సమయంలో రోజువారీ ప్రయాణికులు ఉద్యోగాల కోసం వెళ్తున్న సమయంలో పేలుడు సంభవించడంతో ప్రాణనష్టం ఎక్కువగా సంభవించింది. బ్రస్సెల్స్ ఎయిర్‌పోర్టు వద్ద జరిగిన పేలుళ్లలో 14 మంది చనిపోగా, 96 మంది గాయపడినట్లు అగ్నిమాపక విభాగం ప్రతినిధి ఒకరు చెప్పారు. గాయపడిన వారిలో చాలామంది కాళ్లు చేతులు తెగిపోయిన వారున్నారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వారు చెప్పారు. మెట్రో స్టేషన్‌లో జరిగిన పేలుడులో 20 మంది చనిపోగా 106 మంది గాయపడ్డారని నగర మేయర్ చెప్పారు.
విమానాశ్రయం మెయిన్ టెర్మినల్ బిల్డింగ్‌నుంచి దట్టమైన పొగలు అంతటా వ్యాపించడంతో ఏమి జరిగిందో అర్థం కాక జనం భీతావహులైనారు. విమానాశ్రయంలోని మొత్తం ప్రయాణికులను ఖాళీ చేయించిన భద్రతా అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్నంతా తమ అధీనంలోకి తీసుకున్నారు. విమానాశ్రయానికి వచ్చి, వెళ్లే విమాన సర్వీసులన్నిటినీ నిలిపి వేశారు. అలాగే నగరంలో మెట్రో, ట్రామ్, బస్సు సర్వీసులను సైతం తాత్కాలికంగా నిలిపివేశారు. ఒక మనిషి అరబిక్ భాషలో కొన్ని మాటలు అన్నాడని, ఆ వెంటనే పెద్ద పేలుడు శబ్దం విన్నానని విమానాశ్రయం బ్యాగేజి సెక్యూరిటీ ఆఫీర్ అల్ఫోంసే లిరా చెప్పార.
గత ఏడాది నవంబర్‌లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన మారణకాండ ప్రధాన నిందితుడిగా నావిస్తున్న సలాహ్ అబ్దెస్లామ్‌ను గత శుక్రవారం బ్రస్సెల్స్‌లో నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసిన కొద్ది రోజుకే ఈ పేలుళ్లు జరగడంతో ఐరోపా దేశాలన్నీ కూడా ఉలిక్కి పడ్డాయి. బెల్జియం పేలుళ్ల పట్ల దిగ్భ్రాంతితో పాటు ఆ దేశానికి సంఘీభావం ప్రకటించిన ఐరోపా దేశాల నేతలు ఉగ్రవాదంతో కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పారు. ఐరోపా మొత్తం దిగ్భ్రాంతికి గురయిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో బెల్జియంకు అవసరమైన సహాయ సహకారాలన్నిటినీ అందజేస్తామని బ్రిటీష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రకటించారు.

చిత్రం... బాంబు పేలుళ్ల అనంతరం బ్రెజిల్‌లోని మాల్‌బీక్ మెట్రో స్టేషన్‌ను చుట్టుముట్టిన భద్రతా దళాలు