అంతర్జాతీయం

ఉగ్రవాదంపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో మంగళవారం జరిగిన మారణకాండను ప్రపంచ దేశాల నేతలు ముక్తకంఠంతో ఖండించడమే కాకుండా ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామని ప్రతిన బూనారు. బెల్జియంకు సంఘీభావం సూచకంగా పారిస్‌లోని ఈఫిల్ టవర్ మొదలుకొని బెర్లిన్‌లోని బ్రాండెన్‌బర్గ్ గేట్ దాకా ప్రపంచ ఫ్రఖ్యాత కట్టడాలన్నిటినీ ఆ దేశ జాతీయ పతాకంలోని నలుపు, పసుపు, ఎరుపు రంగు విద్యుద్దీపాలను వెలిగించారు. మృతులకు నివాళి అర్పించడం కోసం బ్రస్సెల్స్‌లో వేలాది మంది నగరంలో చరిత్రాత్మక కూడలి అయిన ప్లేస్ డి లా వద్ద గుమి కూడారు. మంగళవారం ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు బ్రస్సెల్స్ విమానాశ్రయం, ఐరోపా సమాజం ప్రధాన కార్యాలయాలకు అత్యంత చేరువలో ఉన్న మెట్రో స్టేషన్‌పై దాడి చేసి దాదాపు 35 మందిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. బ్రస్సెల్స్ దాడులను తమ స్వేచ్ఛాయుత ప్రజాస్వామిక సమాజంపై దాడిగా అభివర్ణిచిన ఇయు హింసాత్మక తీవ్రవాదం, ఉగ్రవాదంపై తామం తా ఒక్కటై పోరాటం సాగిస్తామని ప్రకటించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్, జర్మనీ చాన్సలర్ ఏంజెలో మెర్కెల్, బ్రిటీష్ ప్రధాని డేవిడ్ కామెరాన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా పలు దేశాల నేతలు ఈ దాడి ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్న తమ కృతనిశ్చయాన్ని మరింత బలోపేతం చేసిందని ప్రకటించారు.
అనుమానితుల ఫోటోలు
విడుదల చేసిన పోలీసులు
ఇదిలా ఉండగా మంగళవారం బాంబు పేలుళ్లు జరగడానికి ముందు బ్రస్సెల్స్ విమానాశ్రయంలో బాంబులతో ఉన్న తమ ట్రాలీలను తోసుకువెళ్తున్న ఇద్దరు అనుమానితుల ఫోటోలను విడుదల చేసిన పోలీసులు మూడో వ్యక్తి కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు.
పోలీసు హెలికాప్టర్లు మంగళవారం అర్ధరాత్రి దాకా నగరంపై చక్క ర్లు కొట్టాయని, నగరమంతటా దాడులు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఇస్లామిక్ స్టేట్ జెండా గుర్తున్న ఒక బాంబు, ఇతర రసాయనాలు లభించినట్లు కూడా వారు తెలిపారు. కాగా, బ్రస్సెల్స్‌లో పేల్చేసుకున్న ఇద్దరు మానవ బాంబులు పారిస్ ఉగ్రవాద దాడుల ప్రధాన నిందితుడు సలాహ్ అబ్దెస్లామ్‌తో సంబంధాలున్న సోదరులై ఉండవచ్చని భావిస్తున్నట్లు పోలీసు వర్గాలనుటంకిస్తూ ఆర్‌టిబిఎఫ్ టెలివిజన్ బుధవారం తెలిపింది. ఈ ఇద్దరూ ఖాలిద్, ఇబ్రహీం ఎల్ బక్రౌయిలుగా పేర్కొన్న టెలివిజన్ ఖాలిద్ గత వారం మారు పేరుతో బ్రస్సెల్స్‌లో ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నాడని, దాడుల తర్వాత పోలీసులకు ఆ అపార్ట్‌మెంట్‌లో అబ్దెస్లామ్ వేలిముద్రలు కూడా కనిపించాయని తెలిపింది. దక్షిణ బెల్జియం నగరం చార్లెరోయిలో ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్న దానితో కూడా ఖాలిద్‌కు సంబంధం ఉంది.
గత ఏడాది నవంబర్ 13న పారిస్‌లో దాడులు జరపడానికి ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు ఇదే నగరంనుంచి బయలుదేరినట్లు పోలీసులు భావిస్తున్న విషయం తెలిసిందే. కాగా, బాంబు పేలుళ్లు జరగడానికి ముందు బ్రస్సెల్స్ విమానాశ్రయంలోని సిసిటీవీ కెమెరాల్లో కనిపించిన ముగ్గురిలో మధ్యలో ఉన్న వ్యక్తి ఇబ్రహీం ఎల్ బక్రౌయి అయి ఉండవచ్చని ఒక పోలీసు అధికారి ఎఎఫ్‌పి వార్తాసంస్థకు చెప్పారు. ఈ ముగ్గురిలో ఇద్దరు పేల్చేసుకోగా, మూడో వ్యక్తి పరారీ అయినట్లు భావిస్తున్న పోలీసులు అతనికోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నారు.
chitram...
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ సెంట్రల్ రైల్వే స్టేషన్ వెలుపల బుధవారం సైనికులు గస్తీ నిర్వహిస్తున్న దృశ్యం