అంతర్జాతీయం

అధ్యక్ష రేసులో మరో అడుగు ముందుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోనిక్స్: అమెరికా అధ్యక్ష పదవికోసం ప్రధాన పార్టీలయిన డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మిగతా ప్రత్యర్థులకన్నా ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లు బుధవారం అత్యంత కీలకమైన ఆరిజోనా రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికల్లో భారీ విజయాలు సాధించి మరో అడ్డంకిని అధిగమించారు. అయితే ఉటా రాష్ట్రంలో మాత్రం ఆ ఇద్దరూ తమ ప్రధాన ప్రత్యర్థుల చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అమెరికా పశ్చిమ ప్రాంతంలో అత్యంత కీలక రాష్టమ్రైన ఆరిజోనాలో ట్రంప్, హిల్లరీ క్లింటన్‌లు చెప్పుకోదగ్గ విజయాలు సాధించడం ద్వారా తమ సమీప పోటీదారులైన బెర్నీ శాండర్స్, టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రుజ్‌లను మరింత వెనక్కి నెట్టేసి ఫ్రంట్ రన్నర్లుగా తమ స్థానాలను మరింత పదిలం చేసుకున్నారు. అయితే ఇది జరిగిన కొద్ది గంటలకే పోటీలో రెండో స్థానంలో ఉన్న శాండర్స్, టెడ్ క్రుజ్‌లు ఉటాలో విజయం సాధించడం ద్వారా తాము ఇప్పటికీ పోటీలో ఉన్నామని నిరూపించుకున్నారు. అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకోకుండా అడ్డుకోవడానికి పార్టీలోని వారే శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ ట్రంప్ మాత్రం వరసగా ఒక్కో రాష్ట్రంలో ప్రతినిధుల మద్దతును కూడగట్టుకోవడం ద్వారా ముందుకు దూసుకెళ్తున్నారు. ‘ఆరిజోనాలో నేను ఊహించిన దానికన్నా భారీ విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు మిమ్మల్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను’ అని ట్రంప్ ట్వట్టర్‌లో తన అభిమానులనుద్దేశించి అన్నారు.
ఆరిజోనాలో అద్భుత విజయం సాధించడం ద్వారా ట్రంప్ ఈ రాష్ట్రంనుంచి మొత్తం 58 మంది ప్రతినిధుల మద్దతును సంపాదించుకుని తనకు మద్దతు ఇస్తున్న మొత్తం ప్రతినిధుల సంఖ్యను 739కి పెంచుకోవడమే కాకుండా తన ప్రధాన ప్రత్యర్థి అయిన టెడ్ క్రుజ్‌కు తనకు మధ్య ఉన్న అంతరాన్ని మరింత పెంచుకున్నారు. క్రుజ్‌కు మొత్తం 425 మంది ప్రతినిధుల మద్దతు మాత్రమే ఉంది. అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవాలంటే ట్రంప్‌కు మొత్తం 1237 మంది ప్రతినిధుల మద్దతు కావాలి. మిగతా రాష్ట్రాల్లో జరిగే రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్‌కు కనీసం 52 శాతం ప్రతినిధులు అవసరం. ఇప్పటివరకు ట్రంప్ 19 రాష్ట్రాల్లో విజయం సాధించగా, క్రుజ్ ఎనిమిది రాష్ట్రాల్లో విజయం సాదించారు. కాగా, ఆరిజోనాలో మాజీ విదేవాంగ మంత్రి అయిన హిల్లరీ క్లింటన్‌కు 60 శాతంకు పైగా ఓట్లు లభించగా, ఆమె ఏకైక ప్రత్యర్థి శాండర్స్‌కు 36.8 శాతం ఓట్లే వచ్చాయి. హిల్లరీ క్లింటన్‌కు ప్రస్తుతం 1670 మంది ప్రతినిధులుండగా శాండర్స్‌కు 886 మంది ప్రతినిధులున్నారు.

2,382 మంది ప్రతినిధుల మద్దతు ఎవరికి ఉంటే వారిని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తారు.