అంతర్జాతీయం

పఠాన్‌కోట్.. భారత్ హైడ్రామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఏప్రిల్ 5: పాకిస్తాన్ తన నైజాన్ని మరోసారి చాటుకుంది. పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై ఉగ్రవాద దాడిని పాక్ సంయుక్త దర్యాప్తు బృందం (జెఐటి) అంగీకరించినట్లే అంగీకరించి స్వదేశానికి వెళ్లిన తర్వాత అడ్డం తిరిగింది. పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి హైడ్రామా అని, అది భారత్ సృష్టించుకున్నదేనని, ఈ దాడి గురించి భారత అధికారులకు ముందే తెలుసని జెఐటి ఒక నివేదిక సిద్ధం చేసినట్లు పాక్ మీడియాలో వెల్లడైంది. కేవలం పాక్‌ను భ్రష్ఠు పట్టించడానికి భారత్ ‘పఠాన్‌కోట్ నాటకం’ ఆడిందని కూడా జెఐటి నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిపై దర్యాప్తు జరిపేందుకు జెఐటి సభ్యులు మార్చి 29వ తేదీన పఠాన్‌కోట్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. వైమానిక స్థావరంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు అక్కడికి ఏ మార్గం గుండా వచ్చారన్న విషయాన్ని భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు ఈ సందర్భంగా జెఐటి సభ్యులకు వివరించారు. అయితే పఠాన్‌కోట్‌లో ఎన్‌ఐఎ అధికారులు అందజేసిన సాక్ష్యాధారాలతో జెఐటి సభ్యులు సంతృప్తి చెందలేదని వారం రోజుల క్రితం వార్తలు వెలువడగా, అసలు ఈ దాడి గురించి భారత అధికారులకు ముందుగానే తెలుసని జెఐటి భావిస్తున్నట్లు తాజా వార్తలు స్పష్టం చేస్తున్నాయి. పఠాన్‌కోట్‌లో దాడికి సంబంధించి భారత్ వద్ద బలమైన సాక్ష్యాధారాలేవీ లేవని, అయినప్పటికీ పాకిస్తాన్‌పై ‘దుష్ప్రచారాన్ని’ పెంచేందుకు ఈ దాడిని భారత్ ఒక సాధనంలా వాడుకుందని జెఐటి సభ్యుడు ఒకరు పేర్కొన్నట్లు ‘పాకిస్తాన్ టుడే’ పత్రిక వెల్లడించింది. అంతేకాకుండా పఠాన్‌కోట్‌లో దాడికి పాల్పడిన వారి గురించి భారత్‌కు ముందుగానే తెలుసని జెఐటి తన నివేదికలో అభిప్రాయపడిందని, త్వరలో ఈ నివేదికను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అందజేయనున్నారని జెఐటి వర్గాలు తెలిపాయి.