రాష్ట్రీయం

చరిత్రలో ఉద్యమకారులకు చోటివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజా తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇన్నయ్య విజ్ఞప్తి

సంగారెడ్డి, డిసెంబర్ 7: ఆరున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రాష్ట్ర ప్రజలందరి భాగస్వామ్యం కలిగివుందని, ఏ ఒక్క వ్యక్తికో, కుటుంబానికో, పార్టీకో ప్రాధాన్యతను ఇవ్వకుండా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తుల పేర్లను చరిత్రకు ఎక్కించాలని ప్రజాతెలంగాణ ఉద్యమ వే దిక రాష్ట్ర కన్వీనర్ గాదె ఇన్నయ్య పేర్కొన్నారు. సంగారెడ్డిలోని టిఎన్‌జివోస్ అతిథి గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1953 నుండి నేటి స్వరాష్ట్ర సాధన దిశగా తెలంగాణ చరిత్ర అంతా ప్రజల ఆకాంక్షల అస్తిత్వ ప్రకటనలే అన్నారు. వలస దోపిడీ, పెత్తనం పోవాలని చేసిన ఉద్యమాలు విజయం సాధించాయన్నారు. 1996 నుంచి 2014 వరకు మలిదశ ఉద్యమం మహోన్నతమైందన్నారు. ఇది ఒక చరిత్ర అని, దీనిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గూడేల్లోని తుడుం దెబ్బ, గిరిజనుల నగార, దళితవాడల దండోరా, సకుల జనుల సమ్మెలు తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరకాలం సురక్షితంగా నిలిచిపోవాలన్నారు. నాలుగు కోట్ల ప్రజల త్యాగాల చరిత్ర అని రికార్డు చేయడమే తమ లక్ష్యమన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఒక కుటుంబం, పార్టీకి మాత్రమే పరిమితమైందంటూ పరోక్షంగా కాంగ్రెస్‌పై ఆరోపణలు చేసారు. 60 కోట్ల ప్రజలు, 520 సంస్థానాలు ఉన్న స్వాతంత్య్ర చరిత్రను కుటుంబానికి పరిమితం చేయడం బాధాకరమన్నారు. తాజ్‌మహల్, గోల్కొండ, చార్మినార్‌ను వ్యక్తులకు మాత్రమే పరిమితం చేసారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో టిఆర్‌ఎస్ పాత్ర మరవలేనిదని అన్నారు. ఈ నెల 15 నుంచి జనవరి 15వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో సమాచార సేకరణ కోసం శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీలు, జెండాలు, ఎజెండాలను పక్కన పెట్టి ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి వ్యక్తి తమ పూర్తి ఆధారాలతో సంప్రదించాల్సిందిగా ఆయన సూచించారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, బ్లాగ్‌తో పాటు ఈ-మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించవచ్చన్నారు. వివిధ సందర్భాల్లో రాజకీయ పార్టీలు అనధికారిక సమాచారం ప్రకారం 1200 నుంచి 1500 మంది ఉద్యమంలో ఆత్మబలిదానం చేస్తే ప్రభుత్వం కేవలం 3 జివోల ద్వారా 470 కుటుంబాలకు మాత్రమే పది లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించడం శోచనీయమన్నారు. మిగిలిన కుటుంబాలకు కూడా త్వరితగతిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. ఉద్యమ సమయంలో రైల్‌రోకోలో పాల్గొన్న 2500 మంది నేటికి రైల్వే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ విలేఖరుల సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణంరాజు, రాష్ట్ర బాధ్యుడు ప్రభాకర్‌రెడ్డి, జిల్లా బాధ్యుడు అమర్ తదితరులు పాల్గొన్నారు.