జాతీయ వార్తలు

నేను అమాయకుణ్ణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటవీ అధికారులే కేసు బనాయించారు
కృష్ణ జింకల కేసులో సల్మాన్‌ఖాన్ వాదన
జోధ్‌పూర్, మార్చి 10: కృష్ణ జింకలను వేటాడిన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అమాయకుడినని బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ స్పష్టం చేశారు. 1998 అక్టోబర్‌లో రాజస్థాన్‌లోని కంకణి గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి సల్మాన్‌ఖాన్‌పై కేసు నమోదైంది. ఆయుధ చట్టం కింద ఖాన్‌పై అభియోగాలు నమోదుచేశారు. గురువారం స్థానిక కోర్టులో కేసు విచారణ సందర్భంగా సల్మాన్ తన వాదనను వినిపించారు.‘నేను అమాయకుడిని. అటవీశాఖ అధికారులే నాపై కేసు బనాయించారు’అని ఆరోపించారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో ఖాన్ జోధ్‌పూర్ కోర్టుకు హాజరుకావడం ఇది మూడోసారి. గురువారం ఉదయం ముంబయి నుంచి ఇక్కడకు చేరుకున్న ఆయన తన న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరైన సల్మాన్‌ఖాన్ తన వాదనను వినిపించారు. ఈ కేసులో సాక్షి ఉదయ్ రాఘవన్‌పై అటవీ అధికారులు వత్తిడి తీసుకొచ్చిన పత్రాలపై సంతం చేయించారని ఆయన చెప్పారు. ‘నేను భారతీయుడిని. నా కులం కూడా అదే’నని ఖాన్ పేర్కొన్నాడు. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేశారు. తన వాదనను నిరూపించుకునేందకు ఆధారాలు సమర్పించడానికి సల్మాన్‌కు కోర్టు అవకాశం ఇచ్చిందని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దినేశ్ తివారీ వెల్లడించారు. 1998 అక్టోబర్ 1, 2 తేదీల్లో సల్మాన్ తన తుపాకీతో కృష్ణజింకలను వేటాడినట్టు అభియోగం. దీనిపై 15న అటవీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

(చిత్రం) కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ గురువారం జోధ్‌పూర్ కోర్టుకు హాజరైన దృశ్యం