అంతర్జాతీయం

నాలుగేళ్లలో కోటి ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 31: ఆర్థిక రంగానికి సంబంధించి తాను రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం దేశంలో కోటి ఉద్యోగాలను సృష్టించేందుకు వీలవుతుందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న హిల్లరీ క్లింటన్ ఆదివారం స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ప్రత్యర్థిగా బరిలోకి దిగిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ‘శుష్క వాగ్ధానాలతో’ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, దేశంలో ‘నిజమైన మార్పు’ను తీసుకొచ్చేందుకు ఆయన ఎటువంటి ప్రతిపాదనా చేయడం లేదని హిల్లరీ పేర్కొంటూ, ట్రంప్‌కు అధ్యక్ష పదవి కట్టబెడితే దేశంలో 35 లక్షల ఉద్యోగాలను కోల్పోవడం ఖాయమని హెచ్చరించారు. పెన్సిల్వేనియాలోని జాన్స్‌టౌన్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో హిల్లరీ క్లింటన్ ప్రజలకు ఈ హెచ్చరిక చేశారు. ‘ఆర్థిక వ్యవస్థ పట్ల నాకున్న ఆలోచనల ప్రకారం వచ్చే నాలుగేళ్లలోనే దేశంలో కోటి ఉద్యోగాలను సృష్టించేందుకు వీలవుతుంది. అదే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆయన అనుసరించే విధానాలకు మనం భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని ఇప్పటికే తేలింది’ అని హిల్లరీ పేర్కొన్నారు. ‘వాస్తవానికి ట్రంప్ గురించి మీకు బాగానే తెలుసు. శుష్క వాగ్ధానాలతో ఆయన అందరినీ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప దేశంలో నిజమైన మార్పును తీసుకొచ్చేందుకు ఎటువంటి ప్రతిపాదనా చేయడం లేదన్న విషయం లోతుగా ఆలోచిస్తే మీకే బోధపడుతుంది’ అని హిల్లరీ అన్నారు.
దూసుకుపోతున్న హిల్లరీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డెమొక్రాట్‌ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ దూసుకుపోతున్నారు. గత నెలతో పోలిస్తే ఈ నెలలో ఆమె తన ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే అయిదు పాయింట్ల ముందంజలో ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులపై తాజాగా జరిపిన జాతీయ పోల్‌లో హిల్లరీ 50శాతం డొనాల్డ్ ట్రంప్ 45శాతం మంది మద్దతు సంపాదించారు. అయితే ఇదేమీ పెద్ద తేడా కాదని, హిల్లరికి పెద్ద విజయమూ కాదని విశే్లషకులు అంటున్నారు. పబ్లిక్ పాలసీ పోలింగ్ తాజా ఫలితాలను విడుదల చేసింది.

2012లో బరాక్ ఒబామా గెలిచినప్పుడు కూడా భారీ మెజారిటీ రాలేదని, ఎన్నికలకు ముందు చివరి మూడు నెలల్లో హిల్లరీకి అనుకూలంగా ప్రజాభిప్రాయం గణనీయంగా మారుతుందని ఆమె వర్గీయులు భావిస్తున్నారు. రెండు పార్టీల జాతీయ కనె్వన్షన్లు పూర్తయిన తరువాత ఈ సర్వే జరిగింది. గత నెలతో పోలిస్తే క్లింటన్‌కు సానుకూలత కొంతమేరకు పెరిగింది. హిల్లరీ సొంతపార్టీ డెమొక్రాట్‌లో ఆమె అభ్యర్థిత్వంపై తిరుగులేని మద్దతు పెరిగింది. తన పార్టీలో హిల్లరీ 83శాతం మద్దతు సంపాదించారు. అదే సమయంలో రిపబ్లికన్ పార్టీలో మాత్రం డొనాల్డ్ ట్రంప్‌కు 36శాతం మద్దతు లభిస్తుండగా, 58శాతం వ్యతిరేక అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో హిల్లరీ క్లింటన్