జాతీయ వార్తలు

పార్లమెంట్ భద్రతకు ‘ఆపరేషన్ గోల్డెన్ నోస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: పార్లమెంట్ భవనంపై మరోసారి దాడి జరగకుండా నిరోధించటానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దుర్భేద్యమైన భద్రతాచర్యలకు పూనుకుంది. ‘‘ఆపరేషన్ గోల్డెన్ నోస్’’ పేరుతో కరడుగట్టిన కోరపళ్లున్న జాగిలాలతో ప్రత్యేక భద్రతావలయాన్ని ఏర్పాటు చేసేందుకు హోంశాఖ ఆదివారం ఆమోదం తెలిపింది. ఇండియా టుడే కథనం ప్రకారం పార్లమెంట్‌లో ఇప్పటికే బహుళ అంచెల భద్రతావ్యవస్థ అమలులో ఉంది. అయితే ఎవరైనా పేలుడు పదార్థాలను టేబుళ్లు.. మరో ప్రాంతంలో దాచి ఉంచినా, పూల బొకేల మాటున దాచి తెచ్చినా వాటిని ఇట్టే వాసనపట్టి గుర్తించేందుకు పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చిన జాగిలాలు ఇకపై గస్తీ బృందంలో భాగంగా ఉంటాయి. ఒకవేళ ఎవరైనా పేలుడు పదార్థాన్ని తాకినా, ఈ జాగిలాలు గుర్తిస్తాయి. పార్లమెంట్ భద్రతా సేవల విభాగం విజ్ఞప్తి మేరకు ఐటిబీపీ దళాలు తమ కె9 సెక్యూరిటీ యూనిట్‌లను పార్లమెంట్‌లో మోహరిస్తాయి. ఐటిబీపీకి చెందిన జాగిలాలు ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన శిక్షణ పొందినవిగా పేరున్నవి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిరుడు భారత్ వచ్చినప్పుడు అమెరికా నావికాదళం ఒబామా భద్రతకు ఐటిబిపి జాగిలాలనే ఎంచుకున్నాయి. వర్షాకాల సమావేశాల నాటికి ఈ జాగిలాల ఆపరేషన్ పూర్తి అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.